Yadagirigutta | యాదాద్రీశుని భక్తులకు అలర్ట్.. ఆ సమయంలో ఆలయానికి వెళ్లారో ఇక అంతే!
Yadagirigutta | వరుస సెలవులు. సాధారణంగా సెలవు రోజుల్లో యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. అయితే శనివారం యాదాద్రీశుడిని దర్శించుకోవాలనే భక్తులకు ముఖ్యగమనిక.
Yadagirigutta | త్రినేత్ర.న్యూస్: వరుస సెలవులు. సాధారణంగా సెలవు రోజుల్లో యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. అయితే శనివారం యాదాద్రీశుడిని దర్శించుకోవాలనే భక్తులకు ముఖ్యగమనిక. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తుల దర్శనాలు నిలిచిపోనున్నాయి. ఎందుకంటే ఆలయ నూతన పాలకవర్గం (Trust Board) ఉదయం 11.37 గంటలకు స్వామివారి చెంత ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి రెండు గంటలపాటు నారసింహుని దర్శనాలను నిలిపివేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొండపైకి ప్రైవేటు వాహనాలను కూడా అనుమతించరు. అదేవిధంగా నిత్యకైంక్యర్యాల సమయాల్లో కూడా అధికారులు తాత్కాలిక మార్పులు చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిత్య కల్యాణం జరుగనుంది.

నూతన పాలకమండలి..
గత నెల 30న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలకమండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. చైర్మన్, సభ్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ (Endowments Department) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దేవస్థానం బోర్డు చైర్మన్‌గా ఎం.సత్యనారాయణ రెడ్డి నియమితులవగా, ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలప్పగారి విజయరాజం, విజయేందర్ తుల్లా, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కంతమణి, ఎం. రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, ఫౌండర్ ట్రస్టీ సభ్యులుగా ఉన్నారు.
వీరితో పాటు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (CS), దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, వైటీడీఏ (YTDA) వైస్ చైర్మన్, దేవస్థానం ఈవో, స్థానాచార్యులు (ప్రధాన అర్చకులు) తదితరులు ఎక్స్-అఫీషియో (Ex-officio) సభ్యులుగా వ్యవహరించనున్నారు.
పదవీకాలం..
కొత్తగా నియమితులైన ఈ పాలకమండలి (ఎక్స్-అఫీషియో సభ్యులు, ఫౌండర్ ట్రస్టీ మినహాయించి) పదవీకాలం నియామక తేదీ నుంచి రెండేళ్ల పాటు (2 years) ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సంబంధిత వార్తలు

Karne Prabhakar | ఏకపక్ష నిర్ణయం.. రేవంత్ అహంకారపూరిత వైఖరికి నిదర్శనం : మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
జులై 1, 2026

CM Revanth Reddy | మార్కెట్ రేటు ప్రకారమే యాదగిరిగుట్ట భూముల కేటాయింపు : సీఎం రేవంత్ రెడ్డి
జూన్ 30, 2026

Darshan | ఓటీటీలోకి కన్నడ హీరో దర్శన్ లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ – డిజాస్టర్ టాక్‌తో నలభై ఐదు కోట్ల కలెక్షన్స్
జూన్ 22, 2026
తాజావార్తలు
- ●POCSO Case | పోక్సో కేసు పెట్టారని.. భార్య, ఇద్దరు పిల్లలు సహా ఆరుగురి దారుణ హత్య
- ●Horoscope | జూలై 11 రాశి ఫలాలు.. ఈ రాశివారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..

POCSO Case | పోక్సో కేసు పెట్టారని.. భార్య, ఇద్దరు పిల్లలు సహా ఆరుగురి దారుణ హత్య

Horoscope | జూలై 11 రాశి ఫలాలు.. ఈ రాశివారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి



