త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amarnath Yatra | భక్తులు రావొద్దు.. అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక‌ బ్రేక్‌.. మ‌ళ్లీ ఎప్పుడంటే?

Amarnath Yatra | ప‌విత్ర అమ‌ర్‌నాథ్ యాత్రను (Amarnath Yatra) అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, భ‌క్తులు రావొద్ద‌ని సూచించారు.

G

National | Published On Jul 19, 2026, 10.30 am IST

Amarnath Yatra | భక్తులు రావొద్దు.. అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక‌ బ్రేక్‌.. మ‌ళ్లీ ఎప్పుడంటే?
Advertisement

Amarnath Yatra | త్రినేత్ర‌.న్యూస్‌: ప‌విత్ర అమ‌ర్‌నాథ్ యాత్రను (Amarnath Yatra) అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, భ‌క్తులు రావొద్ద‌ని సూచించారు. వాతావ‌ర‌ణ శాఖ (IMD) సూచ‌న‌తో యాత్రికుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని జూలై 19 (ఆదివారం) నుంచి యాత్ర‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు (Suspended ) తెలిపారు.ప‌హ‌ల్గామ్‌, బాల్తాల్ మార్గాల గుండా యాత్ర కొన‌సాగ‌కుండా అధికారులు ఉత్త‌ర్వులు జారీచేశారు. త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చేవ‌ర‌కు యాత్ర చేప‌ట్ట‌కూడ‌ద‌ని, భ‌క్తులు స‌హ‌క‌రించాల‌ని పేర్కొన్నారు.

ఇప్ప‌టికే 3.7 ల‌క్ష‌ల మంది..

వాతావరణ పరిస్థితులపై సమగ్రంగా సమీక్ష జరిపిన తర్వాత ఈ మార్గం నుంచి యాత్ర పునఃప్రారంభం గురించి త్వరలో వివ‌రాలు తెలియజేస్తామ‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం నుంచి బల్తాల్, నున్వాన్/చందన్‌వారి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులు ముందుకు వెళ్లడానికి అనుమతించ‌రు. జూలై 2న ప్రారంభమైన అమ‌ర్‌నాథ్‌ యాత్ర 57 రోజుల‌పాటు కొన‌సాగ‌నుంది. ఇప్ప‌టివరకు 3.76 లక్షల మందికి పైగా యాత్రికులు మంచు శివ‌లింగాన్ని దర్శించుకున్నారు. షెడ్యూల్ ప్ర‌కారం ఆగ‌స్టు 28 వ‌ర‌కు యాత్ర కాన‌సాగ‌నుంది.

కాగా, యాత్ర సాగే బల్తాల్ బేస్ క్యాంప్​, పరిసర ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ (IMD) సూచించింది. జూలై 19 నుంచి 23 వరకు జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir) ప‌లు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చ‌రించింది. జ‌మ్ము, క‌థువా, సాంబా, రాజౌరి, దోడా, రాంబ‌న్‌, కిష్ట్వార్ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు, రియాసి, ఉధంపూర్ జిల్లాల్లో అతిభారీ వాన‌లు కురుస్తాయ‌ని తెలిపింది. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా యాత్ర‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు అధికారులు చెప్పారు. అదేవిధంగా వైష్ణోదేవి యాత్రను (Vaishno Devi Yatra) కూడా నిలిపివేశారు.

Advertisement
Advertisement