TRAI | దేశవ్యాప్తంగా రానున్న పబ్లిక్ వైఫై.. అభిప్రాయాలను స్వీకరిస్తున్న ట్రాయ్..
TRAI | దేశవ్యాప్తంగా పబ్లిక్ వైఫై నెట్‌వర్క్ ల విస్తరణపై దృష్టి సారించిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ విషయంపై ఓ సంప్రదింపు పత్రాన్ని అధికారికంగా విడుదల చేసింది.
Technology | Published On Apr 28, 2026, 12.22 pm IST
TRAI | దేశవ్యాప్తంగా పబ్లిక్ వైఫై నెట్‌వర్క్ ల విస్తరణపై దృష్టి సారించిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ విషయంపై ఓ సంప్రదింపు పత్రాన్ని అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం నియంత్రణ చట్టాన్ని సమీక్షించడంతోపాటు, పబ్లిక్ వైఫై విస్తరణను ప్రభావితం చేస్తున్న సవాళ్లను గుర్తించడం, దేశవ్యాప్తంగా ఈ కీలకమైన మౌలిక సదుపాయాల వృద్ధిని వేగవంతం చేయడానికి చేపట్టదగ్గిన చర్యలపై భాగస్వాముల నుంచి అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ట్రాయ్ ఈ పత్రాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం పబ్లిక్ వైఫై ఎకో సిస్టమ్‌కు సంబంధించిన అనేక కీలక అంశాలను సమగ్రంగా వివరించనున్నారు.
ఆచరణీయమైన పబ్లిక్ వైఫై మోడల్స్ రూపకల్పనకు..
ప్రపంచ దేశాల్లో అమల్లో ఉన్న పబ్లిక్ వైఫై వ్యవస్థలు, వాటిపై అవగాహన కలిగి ఉండడం, దేశీయ వ్యూహాలకు మార్గదర్శనం చేయడానికి అంతర్జాతీయ సంస్థల నుంచి కీలక విషయాలను సేకరించడం, ప్రస్తుతం భారత్‌లో పబ్లిక్ వైఫై వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపై సమగ్ర అంచనా, విస్తరణ చేపట్టే మార్గాలు, మౌలిక సదుపాయాల్లో లోపాలు, మారుతున్న వినియోగదారుల డిమాండ్ సరళిని విశ్లేషించడం వంటి అంశాలను ఈ పత్రం ద్వారా ట్రాయ్ తన భాగస్వాములకు తెలియజేయనుంది. అలాగే లాస్ట్ మైల్ కనెక్టివిటీ పరిమతులు, రైట్ ఆఫ్ వే సవాళ్లు, వాణిజ్య సాధ్యాసాధ్యాలు వంటి ప్రాథమిక సమస్యలను గుర్తించడం, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ కేంద్రాలు, అధిక సంచారం కలిగిన ప్రదేశాలకు అనుగుణంగా ఆచరణీయమైన పబ్లిక్ వైఫై మోడల్స్‌ను అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, ప్రైవేటు సంస్థలు పోషించాల్సిన పాత్రలపై పరిశీలనలు చేయడం వంటి అంశాలను ట్రాయ్ చర్చించనుంది.
పౌరులకు కూడా అవకాశం..
యూపీఐ వంటి ఆధునిక డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలతో అనుసంధానించడంతోపాటు దేశీయ పబ్లిక్ వైఫై వ్యవస్థలో అధికారి ఆధారిత సేవలను అందించడం, నిరంతరాయ రోమింగ్, స్టాండర్డ్ ప్రాసెస్, బిల్లింగ్ వంటి వ్యవస్థలకు సంబంధించిన సమస్యల అన్వేషణపై కూడా ట్రాయ్ దృష్టి సారించనుంది. దేశ వ్యాప్తంగా పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌ల దీర్ఘకాలిక ఆర్థిక సుస్థిరతను నిర్దారించడానికి అవసరమైన ప్రీమియం యాక్సెస్, ప్రకటనల ఆధారిత మోడల్స్, డేటా ఆఫ్‌లోడింగ్ వంటి ప్రత్యక్ష, పరోక్ష ఆదాయ మోడల్స్ విశ్లేషణ చేపట్టనున్నారు. ట్రాయ్ సంప్రదింపుల పత్రాన్ని సాధారణ ప్రజల కోసం కూడా అందుబాటులో ఉంచింది. ట్రాయ్ అధికారిక వెబ్‌సైట్ https://trai.gov.in/ ను సందర్శించి పౌరులు ఈ విషయంపై తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. అందరికీ అందుబాటులో ఉండేలా ఓ పకడ్బందీ పబ్లిక్ వైఫై వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేయడమే లక్ష్యంగా ట్రాయ్ ఈ పనికి శ్రీకారం చుట్టింది. ఎప్పటి నుంచో దీనిపై అనేక చర్చలు కొనసాగుతున్నా ఇప్పటికీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే దీనిపై ట్రాయ్ తన భాగస్వాములతోపాటు ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను కోరుతూ ఓ పటిష్టమైన మోడల్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే పౌరులు తమ అభిప్రాయాలను ఆ వెబ్‌సైట్‌లో మే 25వ తేదీ వరకు నమోదు చేయవచ్చు. అలాగే జూన్ 8 వరకు ఆ అభిప్రాయాలపై స్పందించేందుకు సంస్థలకు గడువు ఇచ్చింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Revanth Reddy | అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో రేవంత్ రెడ్డి భేటీ
- ●Saidabad Steel Bridge | సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభానికి సన్నాహాలు.. పరిశీలించిన మంత్రులు
- ●Nama Nageswara Rao | గ్రూప్స్ అభ్యర్థి వేణుకుమార్‌కు అండగా నామ.. డిశ్చార్జ్ బిల్లు మొత్తం మాఫీ చేయించిన మాజీ ఎంపీ
- ●Rakul Preet Singh | రకుల్ కొత్త ప్రయోగం.. సక్సెస్ అవుతుందా.. బెడిసికొడుతుందా?
- ●Janhvi Kapoor | ‘రాకా’లో జాన్వీ కపూర్..? సోషల్ మీడియా వార్తల్లో నిజమెంతా!
- ●Upper Manair | ఎగువ మానేరుకు చేరుతున్న వరద.. పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్

Revanth Reddy | అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో రేవంత్ రెడ్డి భేటీ

Saidabad Steel Bridge | సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభానికి సన్నాహాలు.. పరిశీలించిన మంత్రులు

Nama Nageswara Rao | గ్రూప్స్ అభ్యర్థి వేణుకుమార్‌కు అండగా నామ.. డిశ్చార్జ్ బిల్లు మొత్తం మాఫీ చేయించిన మాజీ ఎంపీ

Rakul Preet Singh | రకుల్ కొత్త ప్రయోగం.. సక్సెస్ అవుతుందా.. బెడిసికొడుతుందా?






