త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Mataram | ఇక‌పై వందేమాతరం త‌ప్ప‌నిస‌రి.. జ‌న‌గ‌ణ‌మ‌న‌కంటే ముందే ఆల‌పించాలి : కేంద్ర ప్ర‌భుత్వం

Vande Mataram | కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్ర‌క‌ట‌న చేసింది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం 'జనగణమన'కు (Jana Gana Mana) ముందుగా జాతీయ గేయం 'వందేమాతరం' ను (Vande Mataram) ఆలపించాల్సిందేనని స్పష్టం చేసింది.

D

National | Published On Feb 11, 2026, 11.43 am IST

Vande Mataram | ఇక‌పై వందేమాతరం త‌ప్ప‌నిస‌రి.. జ‌న‌గ‌ణ‌మ‌న‌కంటే ముందే ఆల‌పించాలి : కేంద్ర ప్ర‌భుత్వం
Advertisement

Vande Mataram | కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్ర‌క‌ట‌న చేసింది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం 'జనగణమన'కు (Jana Gana Mana) ముందుగా జాతీయ గేయం 'వందేమాతరం' ను (Vande Mataram) ఆలపించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేర‌కు బుధ‌వారం ఉద‌యం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home Ministry) కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది.

ప‌ద్మ అవార్డుల వంటి పౌర పుర‌స్కారాల ప్ర‌దానోత్స‌వం కార్య‌క్ర‌మాల్లోనూ, రాష్ట్ర‌ప‌తి హాజ‌ర‌య్యే అన్ని ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో కూడా వందేమాతరం ఆలపించాల్సి ఉంటుందని కేంద్రం స్ప‌ష్టం చేసింది. సినిమా థియేటర్లలో ఈ గేయాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదని తెలిపింది. జాతీయ గీతాన్ని లేదా గేయాన్ని ఆల‌పించేట‌ప్పుడు ఎవ‌రైనా అంత‌రాయం కలిగిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కేంద్రం హెచ్చ‌రించింది. అలాంటి వారికి గ‌రిష్టంగా మూడు సంవ‌త్స‌రాల జైలు శిక్ష విధించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో అందరూ తప్పనిసరిగా లేచి నిలబడాలని ఉత్తర్వుల్లో స్ప‌ష్టం చేసింది.

గతంలో నెహ్రూ ప్రభుత్వం ‘సెక్యులర్’ అంశాలను కారణంగా చూపి, ఈ గేయంలోని చివరి నాలుగు చరణాలను తొలగించింది. అయితే, తాజా ఆదేశాల ప్రకారం పూర్తి గీతాన్ని ‘అధికారిక వెర్షన్’గా పరిగణించాలని, ఈ పూర్తి గేయాన్ని ఆలపించడానికి మూడు నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుందని హోం శాఖ తెలియజేసింది. వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నూతన మార్గదర్శకాలను తీసుకువచ్చారు. వందేమాతరం గేయాన్ని నవంబరు 7, 1875న బంకించంద్ర ఛటర్జీ రచించారు. గ‌తేడాది న‌వంబ‌ర్ 7 నాటికి ఈ గేయాన్ని ర‌చించి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించారు.

Advertisement
Advertisement