త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

POSCO Case Judgment | వ‌య‌సు 70 ఏండ్లు.. శిక్ష 20 ఏండ్లు.. పోక్సో కేసులో కోర్టు తీర్పు

POSCO Case Judgment | పిల్లల‌కు బుద్ధి చెప్పాల్సిన వ‌య‌సులో బాలిక‌పై లైంగిక దాడి చేశాడో కామాంధుడు. ఇంటి ద‌గ్గ‌ర శేష జీవితం గ‌డ‌పాల్సిన టైంలో క‌ట‌క‌టాల‌పాల‌య్యాడు. సంతోష్ నగర్ పరిధిలో చోటుచేసుకున్న ఈ పోక్సో (POCSO) కేసులో నిందితుడికి కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.

S

Hyderabad | Published On Jun 2, 2026, 12.46 pm IST

POSCO Case Judgment | వ‌య‌సు 70 ఏండ్లు.. శిక్ష 20 ఏండ్లు.. పోక్సో కేసులో కోర్టు తీర్పు
Advertisement

POSCO Case Judgment | త్రినేత్ర‌.న్యూస్‌: పిల్లల‌కు బుద్ధి చెప్పాల్సిన వ‌య‌సులో బాలిక‌పై లైంగిక దాడి చేశాడో కామాంధుడు. 70 ఏండ్ల వ‌య‌సున్న‌ప్ప‌టికీ స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకొనే దారుణానికి ఒడిగ‌ట్టాడు. ఇంటి ద‌గ్గ‌ర శేష జీవితం గ‌డ‌పాల్సిన టైంలో క‌ట‌క‌టాల‌పాల‌య్యాడు. సంతోష్ నగర్ పరిధిలో చోటుచేసుకున్న ఈ పోక్సో (POCSO) కేసులో నిందితుడికి కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.

సంతోష్ నగర్ ఇన్‌స్పెక్టర్ కె.సత్యనారాయణ వివ‌రాల ప్ర‌కారం.. 2023, మే 11న రాత్రి సమయంలో గుల్షన్ ఇక్బాల్ కాలనీలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలిక, పాల‌ ప్యాకెట్ కొనడానికి స్థానిక కిరాణా దుకాణానికి వెళ్లింది. దుకాణ యజమాని అయిన మహ్మద్ జమీరుద్దీన్ (Mohammad Jameeruddhin) బాలికను లోపలికి పిలిచి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంత‌టితో ఆగ‌కుండా అశ్లీల వీడియోలు చూపిస్తూ బెదిరింపులకు గురిచేశాడు. బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చి తన బాబాయ్‌కి, తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మొదట కేసు న‌మోదు కాగా అనంత‌రం సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

రూ.5,000 జ‌రిమానా, జైలు..

నిందితుడిని కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌గా ఐపీసీ సెక్షన్ 376(2)(f), పోక్సో (POCSO) చట్టం 2012 లోని సెక్షన్ 3 r/w 4 కింద నేరం రుజువైనట్లు కోర్టు నిర్ధారించింది. 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని XII అదనపు సెషన్స్ జడ్జి, పోక్సో కేసుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.అర్చన కుమారి 2026, జూన్ 1న తీర్పును వెలువరించారు. దీంతో పాటు 5,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడేలా పనిచేసిన అధికారులను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పి. శివ చంద్ర (ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్, సైబర్ క్రైమ్, హైదరాబాద్), కోర్టులో సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎ.రామ్ రెడ్డి, జె.రామకృష్ణకు అభినంద‌న‌లు తెలిపారు. వీరితో పాటు లీగల్ సపోర్ట్ ఆఫీసర్లు టి. కల్పన, ఎ.ఆర్. హిమ మీనన్, నౌషీన్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ (CDO) డి. నాగరాజు (PC 8019568576), ప్రాసెస్ డ్యూటీ ఆఫీసర్ పూర్ణచందర్ రావు (HC 6236)ను అభినందించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement