Deshapathi Srinivas | తెలంగాణ మీద గద్దలు తిరుగుతున్నయ్.. శత్రువులకు తలుపులు తెరిచే ద్రోహి ఉన్నడిక్కడ: దేశపతి శ్రీనివాస్ ఫైర్
Deshapathi Srinivas | కేసీఆర్ అధికారంలో లేకపోయేసరికి మళ్లా తెలంగాణ మీద రకరకాల గద్దలాడుతున్నాయని.. ఈ సినిమా గద్దలన్నీ గూడా తెలంగాణ చుట్టూ తిరుగుతున్నాయని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఉద్యమకారుల మీదకు రైఫిల్ ఎత్తిన ద్రోహి ఈరోజు విగ్రహాల పేరిట రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు.
Deshapathi Srinivas | త్రినేత్ర.న్యూస్: కేసీఆర్ అధికారంలో లేకపోయేసరికి మళ్లా తెలంగాణ మీద రకరకాల గద్దలాడుతున్నాయని.. ఈ సినిమా గద్దలన్నీ గూడా తెలంగాణ చుట్టూ తిరుగుతున్నాయని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల మీదకు రైఫిల్ ఎత్తిన ద్రోహి ఈరోజు విగ్రహాల పేరిట రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు.
ప్రతిష్టించదలచుకున్నది చంద్రబాబు నాయుడిని..
ఉద్యమకారులను చంపేస్తనని రైఫిల్ ఎత్తిన ద్రోహి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నడు. ఆద్రోహే ఇవాళ తిరిగి మళ్లీ తెలంగాణ అస్తిత్వం మీద మబ్బులు ముసురుకుంటే కోట లోపటుండి శత్రువులకు తలుపులు తెరుస్తుండు. ఆ ద్రోహి ఇవాళ విగ్రహాల పేరిట రాజకీయాలు చేస్తుండు. ఎన్టీఆర్ విగ్రహాలు చాలా కాలంగా తెలంగాణల ఉన్నయ్. మనం పలగ్గొట్టలే. మనమేం తీసేయలే. కానీ ఇవాళ పెడుతుంది ఎన్టీఆర్ విగ్రహం మాత్రమే కాదు.. ఆ విగ్రహం వెనక ప్రతిష్టించదలచుకుంది చంద్రబాబు నాయుడిని. అందుకే విగ్రహాల మాటున రాజకీయం నడుస్తున్నది అని దేశపతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మళ్లొక్కసారి ప్రళయ గర్జన చేయాలే..
ఈ సందర్భంలో ఈ పుష్కర తెలంగాణ మనకు కొత్త కర్తవ్యాలను ఉపదేశిస్తున్నది. మనకు కొత్త తథాన్ని నిర్దేశిస్తున్నది. మళ్లీ మనలో పోరాట స్ఫూర్తిని రగల్చమని, మళ్లా ఒకసారి తెలంగాణ జెండానెత్తుకొని జై తెలంగాణ అని ప్రళయ గర్జన చేయమని బోధిస్తున్నది ఈ తెలంగాణ అని పిలుపునిచ్చారు.
369 బిడ్డల్ని కాల్చి చంపింది ఇందిరమ్మ..
ఏ ఇందిరమ్మ ఇందిరమ్మ అని అంటున్నరో ఆ ఇందిరమ్మనే 369 మంది బిడ్డల్ని కర్కశంగా కాల్చి చంపించింది. వాళ్ల దేహాల సాక్షిగా, అమరుల ఆరిపోని శ్వాసల సాక్షిగా ఈ తెలంగాణ చైతన్య దీపాన్ని జయశంకర్, కేశవరావ్ జాదవ్, భూపతి కృష్ణమూర్తి, కాళోజీ నారాయణరావు వంటి వాళ్లు కాపాడుకుంటూ వచ్చారు. ఎవరో ఒకరు వచ్చి ఈ దీపాన్ని కాపాడకపోతారా అనే సమయంలో 2021, ఏప్రిల్ 27న వచ్చిండు ఒక బక్కపలుచని మనిషి. గాలొస్తే ఎగిరిపోయేట్లు ఉన్నడు ఇతనితో ఏమైతది అనుకున్నరు. కానీ ఆయన్నే తెలంగాణను తుఫాన్ లా చుట్టుముట్టిండు.. ఆయన్నే కేసీఆర్.
మూడక్షరాల విస్ఫోటనం..
మూడక్షరాల విస్ఫోటనం. ఆరిపోయిన అమరుల శ్వాసలు భూమిలో నిక్షిప్తమైతే వాటినే ఆటంబాంబులు చేసి మళ్లీ పేల్చిండు కేసీఆర్. తెలంగాణ ఉద్యమానికి రాజకీయ రూపం ఇచ్చిన వ్యక్తి. ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయికి తీసుకెళ్లినవాడు. ఇక్కడ చంద్రబాబు, అక్కడ వాజ్‌పేయి వంటి వాళ్లు ఉన్నప్పటికీ అటువంటి సమయంలో పార్టీ పెట్టిన మొనగాడు కేసీఆర్ అని దేశపతి కొనియాడారు.
ఎన్నికలకు ముందు జై తెలంగాణ.. తర్వాత నై తెలంగాణ..
పైన సోనియాగాంధీ, కింద రాజశేఖర్‌రెడ్డి.. ఇక్కడా అక్కడా కాంగ్రెస్సే. అప్పుడే కేంద్రమంత్రి పదవిని ఇసిరికొట్టి, కరీంనగర్ ఉపఎన్నికను సృష్టించి కాలాన్నే గడగడలాడించిన వ్యక్తి కేసీఆర్. ఏళ్లుగా ప్రజల్లో తలపెల ఉడుకుతున్న ఆగ్రహమే ఆయనకు బలంగా మారింది. డప్పులు కొట్టే కళాకారులు, పుస్తకాలు పట్టుకొని వచ్చే మేధావులు, డాక్టర్లు, న్యాయవాదులు ఇలా అందిరితో మమేకమైండు. ఎన్నికలకు ముందు జై తెలంగాణ.. ఎన్నికల తర్వాత నై తెలంగాణ అనే కుట్రలను తిప్పి కొట్టిండు. కేసీఆర్ కేంద్రంగనే అల్పపీడనం అల్లుకున్నది అని ఆయన వ్యాఖ్యానించారు.
ఫీనిక్స్ పక్షిలా..
2009 ఎన్నికల్లో ఓడినా వెనక్కి తగ్గలే. కేసీఆర్ ఒక ఫీనిక్స్ పక్షి. ఆ పక్షిని చంపి కాలబెట్టినా అది మళ్లా లేస్తది. కేసీఆర్ ప్రతి పార్టీని గజగజ వణికించిండు. ఇప్పుడున్నాయనకు అప్పుడు బుద్ధి రాలేదు. ఇప్పుడు జ్ఞానం రాలేదు. ఒక్కనాడు జయశంకర్ సరసన నిలబడలే. చంద్రబాబు పాదాల దగ్గరే మోకరిల్లిండు అని ఎమ్మెల్సీ దేశపతి విమర్శించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Neha Bora | మహిళలను రాత్రిపూట నిర్బంధించడమేంటి..? ఇది ఏ చట్టప్రకారం సమర్థనీయం : నేహా బోరా
- ●Railway Station Master | రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు కనీస వయస్సు 20 ఏండ్లకు పెంపు..
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో పెట్టుబడుల జోరు.. స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..
- ●CJP Mumbai Protests Flops | ముంబైలో సీజేపీ నిరసన అట్టర్ ఫ్లాప్
- ●BS-VII | వాహనాలకు బీఎస్-7 నిబంధనలు.. కీలక మార్పులకు కేంద్రం కసరత్తు..
- ●New Zealand Bra Fence | న్యూజిలాండ్లో వింత టూరిస్ట్ స్పాట్: 40 మీటర్ల కంచె నిండా వందలాది బ్రాలు.. అసలు కథేంటంటే!

Neha Bora | మహిళలను రాత్రిపూట నిర్బంధించడమేంటి..? ఇది ఏ చట్టప్రకారం సమర్థనీయం : నేహా బోరా

Railway Station Master | రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు కనీస వయస్సు 20 ఏండ్లకు పెంపు..

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో పెట్టుబడుల జోరు.. స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..

CJP Mumbai Protests Flops | ముంబైలో సీజేపీ నిరసన అట్టర్ ఫ్లాప్






