Dimagi Naxals | ప్రధాని “దిమాగీ నక్సల్స్” వ్యాఖ్యలు సిగ్గు చేటు.. అసలు దీని అర్థమేంటి..? : CPI ప్రధాన కార్యదర్శి డి. రాజా
Dimagi Naxals | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేసిన దిమాగీ నక్సల్స్ (Dimagi Naxals) వ్యాఖ్యలను CPI ప్రధాన కార్యదర్శి డి. రాజా (D Raja) తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు.
Dimagi Naxals | త్రినేత్ర న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేసిన దిమాగీ నక్సల్స్ (Dimagi Naxals) వ్యాఖ్యలను CPI ప్రధాన కార్యదర్శి డి. రాజా (D Raja) తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కాలక్రమేణా మారుస్తూ వస్తున్న రాజకీయ నినాదాలను ఆయన తీవ్రంగా ఎండగట్టారు. మొదట వారు "కాంగ్రెస్ ముక్త్ భారత్" నినాదం నుంచి "నక్సల్ ముక్త్ భారత్" వైపు మళ్లారని.. ఇప్పుడు దేశమంతటా "దిమాగీ నక్సల్స్" ఉన్నారంటూ కొత్త రాగం ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ఎవరినైనా దిమాగీ నక్సల్ పేరుతో పిలిచే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాను కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ విధానాలపై నిరసనలు తెలుపుతూ ప్రజల తరఫున పోరాడుతున్నానన్నారు. తనను కూడా దిమాగీ నక్సల్ అంటారా..? అసలు దీని అర్థం ఏంటి..? అని ప్రశ్నించారు.
రాజ్యాంగ వ్యవస్థల్లోకి RSS చొరబడుతోంది
దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నీ కబ్జాకు గురవుతున్నాయని, విద్యా సంస్థల్లోకి ఆర్ఎస్ఎస్ చొరబడుతోందని ఆరోపించిన ఆయన.. నియామకాలు జరుగుతున్న తీరును ప్రశ్నించారు. "దేశంలోని విశ్వవిద్యాలయాలు సహా అన్ని రాజ్యాంగ వ్యవస్థల్లోకి RSS చొరబడుతోంది. అన్ని సంస్థలను వారు కబ్జా చేస్తున్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. మోదీ గారికి నేను చెప్పేది ఒక్కటే.. ఆర్ఎస్ఎస్ విషయంలో ఏం జరుగుతుందో మీరు గమనించండి. నియామకాలు జరుగుతున్న తీరు గురించి ఉపాధ్యాయ ప్రతినిధులను, విద్యార్థులను అడిగి తెలుసుకోండి" అని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ ఏ చట్ట పరిధిలోకి రాదని, అలాంటి సంస్థ దేశంలోని అన్ని వ్యవస్థలను ఎలా లొంగదీసుకుంటోందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఖర్గే దీపావళి-ఈద్ వ్యాఖ్యలకు మద్దతు
మరోవైపు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జురన ఖర్గే (Mallikarjuna Kharge) చేసిన దీపావళి-ఈద్ వ్యాఖ్యలు (Diwali-Eid Remarks) చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ "దీపావళి అనేది సంతోషాల ఈద్" అని వ్యాఖ్యానించారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హిందూ పండుగల ప్రాముఖ్యతను తగ్గించడానికి ప్రయత్నిస్తోందని, ఇది ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమేనంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో ఖర్గేకి రాజా మద్దతుగా నిలిచారు. బీజేపీ ప్రతీ చిన్న విషయాన్ని పట్టుకుని దానికి మత రంగు పులిమి సమాజంలో ఉద్రిక్తతలను రేకెత్తించాలని చూస్తోందని మండిపడ్డారు. దీన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
మోదీ దిమాగీ నక్సల్ వ్యాఖ్యలు
ఇటీవలే కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోట నుంచి వచ్చిన దిమాగీ నక్సల్ వ్యాఖ్యలు దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై నుంచి తొలిసారి ప్రధాని ఈ పదాన్ని ఉపగించారు. నిన్న దీపావళి సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో భద్రతా సిబ్బందిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అడవుల్లో సాయుధ నక్సలిజం అంతమైందని చెప్పారు. అయితే, పట్టణాలు, వివిధ వ్యవస్థల్లో చొరబడి రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్న 'దిమాగీ నక్సల్స్' ముప్పు ఇంకా పొంచి ఉందని వ్యాఖ్యానించారు.
"మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. నక్సలైట్లు అంతమొందారు. కానీ ముప్పు ఇంకా తొలగిపోలేదు. అడవుల నుండి సాయుధ నక్సలైట్లు తుడిచిపెట్టుకుపోయినప్పటికీ.. 'దిమాగీ నక్సల్స్' పేరుతో వివిధ సంస్థలు, రాజకీయ పార్టీల్లోకి చొరబడి రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు. మనం వారిని గుర్తించి, ఓడించాలి. వారి నుంచి దేశాన్ని కాపాడుకోవాలి" అని ప్రధాని పిలుపునిచ్చారు.
Also Read..
ఢిల్లీలో కాలుష్యానికి ఆప్ నేతలు కుట్ర : బీజేపీ మంత్రి
సెనెగల్ తీరంలో విషాదం: యూరప్‌నకు వలస వెళ్తూ పడవ బోల్తా.. 34 మంది మృతి
తాజావార్తలు
- ●Charagonda Govt High School | ఇక్కడే ఉండండి సార్.. మమ్మల్ని విడిచి వెళ్లకండి ప్లీజ్
- ●Personal Finance | 20 ఏళ్ల వయస్సులో చేసే ఈ 5 ఆర్థిక తప్పులతో.. భవిష్యత్తులో లక్షల నష్టం..
- ●Road Accident | ఇంకో ఐదు నిమిషాలైతే కాలేజీకి చేరేదే.. ఓయూ విద్యార్థిని ఎలా చనిపోయిందంటే!
- ●Industrial Espionage | ప్రపంచాన్ని షేక్ చేసిన కార్పొరేట్ సీక్రెట్స్.. ఆ కంపెనీల రహస్యాల చోరీ వెనుక అసలు కథ!
- ●Stock Markets | నిఫ్టీ 25,000 దాటినా.. ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి..
- ●Delhi Air Pollution | ఢిల్లీలో కాలుష్యానికి ఆప్ నేతలు కుట్ర : బీజేపీ మంత్రి

Charagonda Govt High School | ఇక్కడే ఉండండి సార్.. మమ్మల్ని విడిచి వెళ్లకండి ప్లీజ్

Personal Finance | 20 ఏళ్ల వయస్సులో చేసే ఈ 5 ఆర్థిక తప్పులతో.. భవిష్యత్తులో లక్షల నష్టం..

Road Accident | ఇంకో ఐదు నిమిషాలైతే కాలేజీకి చేరేదే.. ఓయూ విద్యార్థిని ఎలా చనిపోయిందంటే!

Industrial Espionage | ప్రపంచాన్ని షేక్ చేసిన కార్పొరేట్ సీక్రెట్స్.. ఆ కంపెనీల రహస్యాల చోరీ వెనుక అసలు కథ!






