Central Bank Recruitment | సెంట్రల్ బ్యాంకులో అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 100 ఖాళీలు
Central Bank Recruitment | ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) 2026-27 ఆర్థిక సంవత్సరానికి అప్రెంటిస్ (Apprentice) ఖాళీలను భర్తీ చేయనుంది. 4500 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల (Central Bank Recruitment) చేసింది.
Central Bank Recruitment | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) 2026-27 ఆర్థిక సంవత్సరానికి అప్రెంటిస్ (Apprentice) ఖాళీలను భర్తీ చేయనుంది. 4500 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల (Central Bank Recruitment) చేసింది. డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖలు, కార్యాలయాల్లో ఒక సంవత్సరం శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.15,000 స్టైపెండ్ చెల్లిస్తారు. తెలంగాణలో 100, ఆంధ్రప్రదేశ్‌లో 128 పోస్టులు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 4500
అర్హతలు: మే 31, 2026 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. 2022, జనవరి 1 లేదా ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ అప్రెంటిస్ శిక్షణలో పాల్గొనాలనుకునేవారు కచ్చితంగా NATS పోర్టల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థులు మే 31 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి. అంటే మే 31, 1998 నుంచి మే 31, 2006 మధ్యలో జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం
ఆన్‌లైన్ పరీక్ష, స్థానిక భాషా పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష 100 మార్కులకు, 100 ప్రశ్నలకు ఉంటుంది. గంటలోపు పరీక్ష పూర్తి చేయాలి.
- జనరల్/ఫైనాన్స్ అవేర్నెస్- 20 ప్రశ్నలు
- ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్- 20 ప్రశ్నలు
- కంప్యూటర్ నాలెడ్జ్- 20 ప్రశ్నలు
- జనరల్ ఇంగ్లిష్- 20 ప్రశ్నలు
- సెంట్రల్ బ్యాంక్ సర్వీసుల గురించి- 20 ప్రశ్నలు
- ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కింగ్ లేదు.
- ఎంపికైన వారికి 12 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.944 (పురుషులు), రూ.708 (మహిళలు), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ.236
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 22
ఆన్‌లైన్ పరీక్ష: జూలై మొదటి వారంలో
వెబ్‌సైట్: https://centralbank.bank.in/en/recruitments
తాజావార్తలు
- ●జెన్-జీ రూట్ వేరు... పొలిటీషియన్స్ మైండ్ సెట్ వేరు: యువత 'హాష్‌ట్యాగ్' విప్లవాన్ని పసిగట్టడంలో పాలకుల ఘోర వైఫల్యం!
- ●HYDRA Prajavani Complaints | హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు.. పార్కులనూ వదలట్లేదు
- ●22A చిక్కుముడి: అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి !
- ●CM Revanth Reddy | ఎర్రగడ్డకు వెళ్లి టిమ్స్ కట్టానని చెప్పాడట!. కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు..!
- ●CM Revanth Reddy | పేదల కోసం రేవంత్ అన్న ఉన్నడని భరోసా కల్పించాలి : సీఎం రేవంత్
- ●CM Revanth Reddy | ప్రజాపాలనలో వైద్యానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్‌రెడ్డి

జెన్-జీ రూట్ వేరు... పొలిటీషియన్స్ మైండ్ సెట్ వేరు: యువత 'హాష్‌ట్యాగ్' విప్లవాన్ని పసిగట్టడంలో పాలకుల ఘోర వైఫల్యం!

HYDRA Prajavani Complaints | హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు.. పార్కులనూ వదలట్లేదు

22A చిక్కుముడి: అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి !

CM Revanth Reddy | ఎర్రగడ్డకు వెళ్లి టిమ్స్ కట్టానని చెప్పాడట!. కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు..!






