CCI recruitment | కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్.. జూనియర్ అసిస్టెంట్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు..
CCI recruitment | ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించింది. మొత్తం 148 ఖాళీలతో నోటిఫికేషన్ (CCI recruitment) విడుదల చేసింది.
CCI recruitment | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించింది. మొత్తం 148 ఖాళీలతో నోటిఫికేషన్ (CCI recruitment) విడుదల చేసింది. ఇందులో జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant), అసిస్టెంట్ మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ (Management Trainee) వంటి పోస్టులు ఉన్నాయి. అర్హులైన వారు జూలై 24 వరకు అధికారిక వెబ్‌సైట్ www.cotcorp.org.inలో దరఖాస్తు చేసుకోచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 148
- జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్-50 (జనరల్ 20, ఈడబ్ల్యూఎస్ 5, బీసీ 14, ఎస్సీ 7, ఎస్టీ 4)
- జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్- 50 (జనరల్ 20, ఈడబ్ల్యూఎస్ 5, బీసీ 14, ఎస్సీ 7, ఎస్టీ 4)
- జూనియర్ అసిస్టెంట్ జనరల్- 30 (జనరల్ 11, ఈడబ్ల్యూఎస్ 3, బీసీ 8, ఎస్సీ 5, ఎస్టీ 2)
- మేనేజ్‌మెంట్ ట్రైనీ మార్కెటింగ్- 8 (జనరల్ 1, ఈడబ్ల్యూఎస్ 1, బీసీ 2, ఎస్సీ 2, ఎస్టీ 1)
- మేనేజ్‌మెంట్ ట్రైనీ అకౌంట్స్- 8 (జనరల్ 1, ఈడబ్ల్యూఎస్ 2, బీసీ 2, ఎస్సీ 1),
- అసిస్టెంట్ మేనేజర్ (అఫీషియల్ లాంగ్వేజ్)-1
- అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ)- 1
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కో విదంగా ఉన్నాయి. ఎంబీఏ, సీఏ, సీఎంఏ, బీఎస్సీ అగ్రికల్చర్, బీకామ్, డిగ్రీ, బీఈ, ఎంసీఏ, పీజీ చేసి ఉండాలి. అభ్యర్థులు 30 ఏండ్లలోపు వారై ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 32 ఏండ్లు.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా. మొత్తం 120 మార్కులకు ఉంటుంది. 120 బహులైచ్చిక ప్రశ్నలు అండుగుతారు. 2 గంటల్లో పరీక్ష పూర్తి చేయాలి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ ప్రొఫిసియన్సీ, సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు కనీసం 35 శాతం, మిగిలినవారు 40 శాతం మార్కులు సాధించాలి. ఎంపికైనవారికి 12 నెలలు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష కేంద్రం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.1770, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.590
అప్లకేషన్లకు చివరితేదీ: జూలై 24
వెబ్‌సైట్: www.cotcorp.org.in
పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం




