Adilabad CCI | ఇక ఆదిలాబాద్ సీసీఐ కనుమరుగు.. స్థానికుల ఆవేదన
Adilabad CCI | వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ సీసీఐ (CCI) పునఃప్రారంభం అవుతదని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. చివరకు గురువారం నాడు సిమెంట్ పరిశ్రమలోని భారీ ట్యాంకులను కూల్చేశారు.
Adilabad CCI | త్రినేత్ర న్యూస్ : వేలాది మందికి ఉపాధి కల్పించిన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ సీసీఐ (CCI) పునఃప్రారంభం అవుతదని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. చివరకు గురువారం నాడు సిమెంట్ పరిశ్రమలోని భారీ ట్యాంకులను కూల్చేశారు. ఆ భారీ ట్యాంకులు క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ దృశ్యాలు చూసిన అనంతరం ఆదిలాబాద్ సీసీఐ కనుమరుగు కానుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పరిశ్రమ ప్రారంభం కావడం లేదని, వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారని పేర్కొన్నారు.
1982లో ఆదిలాబాద్ పట్టణం శివారులో కేంద్రం సీసీఐ పరిశ్రమను ప్రారంభించింది. మొత్తం 807 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమను నెలకొల్పగా.. రోజుకు 1200 టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో నిర్మించారు. రెండేళ్ల కాలంలోనే అంటే 1984లో ఈ పరిశ్రమలో సిమెంట్ ఉత్పత్తి ప్రారంభమైంది. సీసీఐలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 వేల కుటుంబాలు ఆధారపడి ఉండేవి.
అయితే అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకు వచ్చింది. ఈ విధానంలో సీసీఐకి ఇచ్చిన ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో సీసీఐకి నష్టాలు మొదలయ్యాయి. 1996లో సీసీఐ నష్టాల్లో కూరుకుపోయింది. నష్టాలు పెరగడంతో 2008లో సీసీఐ ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ప్రకటించి పరిశ్రమను పూర్తిగా మూసివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో వేలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఇక తాజా కూల్చివేతలతో ఈ పరిశ్రమ తిరిగి తెరుచుకునే అవకాశాలు లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Amit Shah | కాంగ్రెస్ పార్టీ 2030 నాటి ఎన్నికల్లోనూ గెలవలేదు : అమిత్ షా
- ●Ramayana | రామాయణపై మరో ట్విస్ట్ - ఓటీటీలో డబ్బులు పెట్టి చూడాల్సిందే - బడ్జెట్ కష్టాలే కారణమా?
- ●Anthropic | క్లాడ్ డుయెట్.. పనులు గుర్తించి పూర్తి చేసే ఏఐ ఏజెంట్..
- ●Hug | భార్యకు హగ్ ఇచ్చాడు.. 5 పక్కటెముకలు విరగ్గొట్టాడు
- ●Revanth Reddy | ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్యల విగ్రహాలు పెడతాం
- ●Gold Rivers In India | గనుల్లోనే కాదు.. భారత్‌లోని ఈ 3 నదుల్లో ఇప్పటికీ బంగారం దొరుకుతుంది!

Amit Shah | కాంగ్రెస్ పార్టీ 2030 నాటి ఎన్నికల్లోనూ గెలవలేదు : అమిత్ షా

Ramayana | రామాయణపై మరో ట్విస్ట్ - ఓటీటీలో డబ్బులు పెట్టి చూడాల్సిందే - బడ్జెట్ కష్టాలే కారణమా?

Anthropic | క్లాడ్ డుయెట్.. పనులు గుర్తించి పూర్తి చేసే ఏఐ ఏజెంట్..

Hug | భార్యకు హగ్ ఇచ్చాడు.. 5 పక్కటెముకలు విరగ్గొట్టాడు





