త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYDRAA | ఐటీ కారిడార్‌లో 5 ఎక‌రాల భూమికి హైడ్రా ఫెన్సింగ్‌.. ఈ భూమి విలువ రూ. 1000 కోట్ల‌కు పైనే..!

HYDRAA | రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లోని 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా మంగ‌ళ‌వారం కాపాడింది.

S

Hyderabad | Published On Jun 24, 2026, 2.59 pm IST

HYDRAA | ఐటీ కారిడార్‌లో 5 ఎక‌రాల భూమికి హైడ్రా ఫెన్సింగ్‌.. ఈ భూమి విలువ రూ. 1000 కోట్ల‌కు పైనే..!
Advertisement

HYDRAA | త్రినేత్ర‌.న్యూస్ : రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లోని 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా మంగ‌ళ‌వారం కాపాడింది. స‌ర్వే నంబ‌రు 42లో మెట‌ల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్‌కు వెళ్లే మార్గంలో అత్యంత విలువైన భూమిని కాజేయాల‌ని కొంత‌మంది ప్ర‌య‌త్నించారు. అక్క‌డ రెండు తాత్కాలిక షెడ్డులు వేసి ఒక గ‌దిని కూడా నిర్మించారు.

5 ఎక‌రాల చుట్టూ రేకుల షీట్ల‌తో ప్ర‌హ‌రీ కూడా నిర్మించే క్ర‌మంలో హైడ్రాకు రెవెన్యూ శాఖ నుంచి ఫిర్యాదు అందింది. ఎన్నో ఏళ్లుగా ఈ భూమి త‌న‌దిగా చెబుతూ ఎవ‌రినీ అటువైపు రానీయ‌కుండా అడ్డుకుంటున్న ప‌రిస్థితుల్లో శేరిలింగంప‌ల్లి రెవెన్యూ అధికారుల విజ్ఞ‌ప్తి మేర‌కు హైడ్రా రంగంలోకి దిగింది. రెండు తాత్కాలిక షెడ్డుల‌తో పాటు.. నిర్మించిన గ‌దితో పాటు ఫెన్సింగ్‌ను హైడ్రా తొల‌గించింది.

మొత్తం ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన త‌ర్వాత 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అలాగే ప్ర‌భుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ భూమి విలువ దాదాపు రూ. వెయ్యికోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా.

Advertisement
Advertisement