త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jairam Ramesh | రిజ‌ర్వేష‌న్లు అంతం చేయ‌డ‌మే బీజేపీ ల‌క్ష్యం.. అందుకే 2/3 మెజారిటీ కోసం తాప‌త్ర‌యం : జైరాం ర‌మేష్‌

Jairam Ramesh | లోక్‌స‌భ‌లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేందుకు బీజేపీ (BJP) తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంద‌ని కాంగ్రెస్ (Congress) సీనియ‌ర్ నేత జైరాం ర‌మేష్ (Jairam Ramesh) తెలిపారు.

D

National | Published On Jun 24, 2026, 2.26 pm IST

Jairam Ramesh | రిజ‌ర్వేష‌న్లు అంతం చేయ‌డ‌మే బీజేపీ ల‌క్ష్యం.. అందుకే 2/3 మెజారిటీ కోసం తాప‌త్ర‌యం : జైరాం ర‌మేష్‌
Advertisement

Jairam Ramesh | లోక్‌స‌భ‌లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేందుకు బీజేపీ (BJP) తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంద‌ని కాంగ్రెస్ (Congress) సీనియ‌ర్ నేత జైరాం ర‌మేష్ (Jairam Ramesh) తెలిపారు. మూడో వంతు మెజారిటీ రాగానే రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేప‌ట్టి రిజ‌ర్వేష‌న్ల ప్ర‌క్రియ‌ను తొల‌గించాల‌ని చూస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

"అధికార పార్టీ మొద‌ట మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల ముసుగులో నియోజ‌క‌ర్గాల పున‌ర్విభ‌జ‌న (డీలిమిటేషన్) తీసుకురావాల‌ని చూస్తోంది. వారి అంతిమ ల‌క్ష్యం మాత్రం రిజ‌ర్వేష‌న్ల‌ను పూర్తిగా ఎత్తివేయ‌డ‌మే. ఒక‌వేళ మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల ప‌ట్ల ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ఉంటే.. ప్ర‌స్తుతం ఉన్న 543 లోక్‌స‌భ స్థానాల ఆధారంగానే వ‌చ్చే 2029 సాధార‌ణ ఎన్నిక‌ల నుంచి నారీ శ‌క్తి వంద‌న్ అధినియం చ‌ట్టాన్ని అమ‌లు చేయాలి" అని జైరాం ర‌మేష్ డిమాండ్ చేశారు.

రాజ్యాంగ సవరణ బిల్లు ఏప్రిల్ 17న లోక్‌ష‌భ‌లో వీగిపోవడాన్ని ఈ సంద‌ర్భంగా జైరాం ర‌మేష్ ప్ర‌స్తావించారు. ప్రతిపక్షాల ఓటు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు వ్యతిరేకంగా పడిందే తప్ప, మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు. "ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ఐక్యంగా దీనికి వ్య‌తిరేకంగా ఓటు వేశాయి. ఈ ప‌రిణామంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు భంగ‌పాటు ఎదురైంది. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ఆ మూడు బిల్లులను ఆమోదింపజేస్తానని మోదీకి షా మాటిచ్చారు. కానీ సభలో 298 కంటే ఎక్కువ ఓట్లను సాధించలేకపోయారు. ఈ ప‌రిణామాల‌తో ప్ర‌ధాని మోదీ తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఈ విష‌యం ఆయ‌న ముఖంలో స్ప‌ష్టంగా క‌నిపించింది. కాంగ్రెస్ వ‌ల్లే మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు కావ‌డం లేద‌ని ఆయ‌న స్వ‌యంగా హ‌స్తం పార్టీని విమ‌ర్శించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లును వ్య‌తిరేకించ‌లేదు. ప్ర‌స్తుతం ఉన్న 543 స్థానాల్లోనే మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని కోరింది" అని జైరాం ర‌మేష్ వివ‌రించారు.

Also Read..

మరో 300కు పైగా ప్రాంతాల్లో అమెజాన్ నౌ.. మీ లోకేషన్‌లో ఉందా..?

ఆస్తి వివాదం.. తండ్రిని నేల‌పై ప‌డేసి కాలితో తొక్కిన కుమారుడు

నిలిచిన మెట్రో రైళ్లు.. లారీలు, ట్ర‌క్కులు ఎక్కిన టెకీలు

Advertisement
Advertisement