త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

C-DAC Recruitment | సీడాక్‌లో 844 ఉద్యోగాలు.. హైద‌రాబాద్ కేంద్రంలో 46 ఖాళీలు

C-DAC Recruitment | కేంద్ర ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది.

G

National | Published On Oct 8, 2026, 6.55 am IST

C-DAC Recruitment | సీడాక్‌లో 844 ఉద్యోగాలు.. హైద‌రాబాద్ కేంద్రంలో 46 ఖాళీలు
Advertisement

C-DAC Recruitment | త్రినేత్ర న్యూస్‌: కేంద్ర ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 844 ఖాళీల‌తో నోటిఫికేష‌న్ (C-DAC Recruitment) విడుద‌ల చేసింది. హైద‌రాబాద్‌, బెంగ‌లూరు, చెన్నై స‌హా మొత్తం 11 సీడాక్ సెంట‌ర్ల‌లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ ఇంజినీర్‌, సీనియ‌ర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ లేదా మాడ్యూల్ లీడ్‌, ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌, టెక్ లీడ్ పోస్టులు ఉన్నాయి. హైద‌రాబాద్‌లో (Hyderabad) 46 పోస్టులు ఉన్నాయి. ఆస‌క్తి క‌లిగిన‌వారు అక్టోబ‌ర్ 26 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. హైద‌రాబాద్ సీడాక్‌లో 46 పోస్టులు ఉన్నాయి. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఎంపికైన‌వారికి ఏడాదికి రూ.3.6 ల‌క్ష‌ల నుంచి రూ.22.9 ల‌క్ష‌ల వ‌ర‌కు జీతం వ‌స్తుంది. ఈ ఉద్యోగాల‌ను కాంట్రాక్టు ప్రాతిప‌దికన భ‌ర్తీ చేస్తున్న‌ది.

 మొత్తం పోస్టులు: 844

సీడాక్ హైద‌రాబాద్‌- 46
సీడాక్ నోయిడా-
207
సీడాక్ పుణె-
142
సీడాక్ తిరువ‌నంత‌పురం-
118
సీడాక్ గువాహ‌టి-
88
సీడాక్ చెన్నై-
88
సీడాక్ బెంగ‌ళూరు-
58
సీడాక్ మొహాలి-
55
సీడాక్ ముంబై-
20
సీడాక్ కోల్‌క‌తా-
19
సీడాక్ ఢిల్లీ-
1

అర్హ‌త‌: బీఈ, బీటెక్‌, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, ఎంఈ, ఎంటెక్‌, పీహెచ్‌డీ, సీఏ, ఎల్ఎల్ఎం, సీఎస్‌, సీఎంఏ, ఎంబీఏ, పీజీ, ఎల్ఎల్‌బీ పూర్తిచేయాలి. 30 ఏండ్ల నుంచి 56 ఏండ్ల మ‌ధ్య (పోస్టును బ‌ట్టి వేర్వేరుగా) ఉండాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 26
వెబ్‌సైట్‌: careers.cdac.in.

 

Advertisement
Advertisement