Hyderabad | ఆరేండ్ల బిడ్డను హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి..
Hyderabad | అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేండ్ల కుమార్తెకు మెరుగైన వైద్యం చేయించలేని ఓ తల్లి ఆ చిన్నారిని హుస్సేన్‌సాగర్‌లోకి (Hussain Sagar) విసిరేసింది. గుర్తించిన ఓ ఆటో డ్రైవర్ (Auto Driver).. సాగర్‌లోకి దిగి చిన్నారిని కాపాడారు.
Hyderabad | త్రినేత్ర న్యూస్: అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేండ్ల కుమార్తెకు మెరుగైన వైద్యం చేయించలేని ఓ తల్లి ఆ చిన్నారిని హుస్సేన్‌సాగర్‌లోకి (Hussain Sagar) విసిరేసింది. గుర్తించిన ఓ ఆటో డ్రైవర్ (Auto Driver).. సాగర్‌లోకి దిగి చిన్నారిని కాపాడారు.
హైదరాబాద్ (Hyderabad) ఓల్డ్ బోయిన్‌పల్లిలోని హస్మత్‌పేట్‌కు (Hasmathpet) చెందిన షబానాను ఐదేండ్ల క్రితం భర్త వదిలేశాడు. అప్పటి నుంచి ఆమె ఇళ్లలో పనిచేస్తూ ఇద్దరు కుమార్తెలను షోషిస్తున్నది. అయితే రెండో కుమార్తె రుక్సానా (6) గత కొన్నిరోజులుగా పెద్దపేగు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నది. వివిధ దవాఖానల్లో చూపించినా ఫలితం లేకుండాపోయింది. మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో చిన్నారికి మెరుగైన వైద్య చికిత్స అందించే స్థోమత లేకపోవడంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నది. రుక్సానాను హుస్సేన్‌సాగర్ వద్దకు తీసుకొచ్చిన షబానా.. ఆమెను ఒక్కసారిగా నీళ్లలోకి విసిరేసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ అది గమనించాడు. వెంటనే హుస్సేన్ సాగర్‌లోకి దూకి చిన్నారిని రక్షించారు. ప్రాణాపాయం తప్పినప్పటికీ ఆమెను చికిత్స కోసం గాంధీ దవాఖానకు (Gandhi Hospital) తరలించారు. . ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత
అక్టోబర్ 9, 2026

VC Sajjanar | ట్యాంక్‌బండ్‌పై పుట్టినరోజు వేడుకలు.. కేక్ కటింగ్స్ వద్దు: సీపీ వీసీ సజ్జనర్
అక్టోబర్ 9, 2026

Malreddy Ranga Reddy | ఆ ఎమ్మెల్యేకు గుడ్ టచ్ ఏదో.. బ్యాడ్ టచ్ ఏదో కాస్త నేర్పించడయ్యా
అక్టోబర్ 8, 2026
తాజావార్తలు
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?



