KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
KCR | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం బతుకమ్మ పండుగ అని ఆయన పేర్కొన్నారు.
KCR | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం బతుకమ్మ పండుగ అని ఆయన పేర్కొన్నారు. పూలనే దేవతగా కొలుస్తూ ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ పండుగ దేశంలోని సంప్రదాయ పండుగలన్నింటిలో ప్రత్యేకమైనదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ జీవన విధానానికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సామాజిక సంస్కృతికి బతుకమ్మ పండుగ దర్పణంగా నిలుస్తోందని తెలిపారు. ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవితంలో అంతర్భాగమైందని పేర్కొన్నారు.
ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే తొమ్మిది రోజుల పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ సందడి నెలకొంటుందని కేసీఆర్ అన్నారు. ఆడపడుచులు పిల్లాపాపలతో ఒకచోట చేరి, ఆటపాటలతో బతుకమ్మను కొలుస్తూ భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. తెలంగాణ తొలి ప్రభుత్వం బతుకమ్మ పండుగకు రాష్ట్ర పండుగ హోదా కల్పించడంతోపాటు, ఆడబిడ్డలకు కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ సంప్రదాయాన్ని ప్రారంభించిందని కేసీఆర్ గుర్తుచేశారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారి సంక్షేమం కోసం నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పలు పటిష్టమైన కార్యక్రమాలను అమలు చేసిందని పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...
- ●K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!

OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ





