VC Sajjanar | ట్యాంక్‌బండ్‌పై పుట్టినరోజు వేడుకలు.. కేక్ కటింగ్స్ వద్దు: సీపీ వీసీ సజ్జనర్
VC Sajjanar | త్రినేత్ర న్యూస్: ట్యాంక్‌బండ్‌తో పాటు ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద అర్ధరాత్రి వేళల్లో పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్‌లు చేయవద్దని నగర ప్రజలు, యువత, తల్లిదండ్రులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) విజ్ఞప్తి చేశారు.
VC Sajjanar | త్రినేత్ర న్యూస్: ట్యాంక్‌బండ్‌తో పాటు ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద అర్ధరాత్రి వేళల్లో పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్‌లు చేయవద్దని నగర ప్రజలు, యువత, తల్లిదండ్రులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) విజ్ఞప్తి చేశారు. సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకలు (Birthday Celebrations) క్షణికావేశం, నిర్లక్ష్యం వల్ల కుటుంబాలకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ సమయంలో ఆరేళ్ల పాప పుట్టినరోజు వేడుక జరిపేందుకు కుటుంబ సభ్యులంతా కలిసి ట్యాంక్‌బండ్‌కు (Tankbund) రాగా, తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగి పుట్టినరోజు నాడే ఆ చిన్నారితో పాటు కుటుంబ సభ్యుడు దుర్మరణం చెందారని తెలిపారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించి కాపాడేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్‌బండ్‌పై ప్రమాద స్థలాన్ని పరిశీలించినట్లు వెల్లడించారు. అక్కడ జరుగుతున్న ప్రమాదాల నివారణపై వివిధ ప్రభుత్వ విభాగాలతో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించామని వివరించారు.
పుట్టినరోజు అనేది కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వేడుకని, దానిని ఇళ్ల వద్ద లేదా ఏదైనా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే జరుపుకోవాలని స్పష్టం చేశారు. అర్ధరాత్రి వేళల్లో (Midnight Celebrations) రోడ్లపై జనసంచారం తక్కువగా ఉండటంతో వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకొస్తుంటాయని, అలాంటి సమయంలో చిన్నపిల్లలను తీసుకుని నడిరోడ్డుపైకి రావడం ఏమాత్రం మంచిది కాదని చెప్పారు. అసలు ట్యాంక్‌బండ్‌పై ఇలాంటి వేడుకలు నిర్వహించడం నిబంధనల ప్రకారం పూర్తిగా నిషేధమని, గతంలోనే జీహెచ్‌ఎంసీ (GHMC) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. పోలీసులు నిరంతరం అక్కడికి వచ్చేవారిని వెనక్కి పంపిస్తున్నప్పటికీ, అర్ధరాత్రి పూట మళ్లీ వచ్చి వేడుకలు చేసుకోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కేవలం క్షణికానందం కోసం చేసే పొరపాట్ల వల్ల అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకోవద్దని హెచ్చరించారు. ఇకపై ఎవరూ కూడా అర్ధరాత్రి వేళల్లో ట్యాంక్‌బండ్, చెరువులు, బహిరంగ ప్రదేశాల వద్దకు వచ్చి సంబరాలు చేసుకోవద్దని, సిటీ పోలీసులకు సహకరిస్తూ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు.
తాజావార్తలు
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?






