త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BSNL Recruitment | బీఎస్ఎన్‌లో ఉద్యోగాలు.. బీటెక్‌, సీఏ అర్హ‌త‌తో సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌లు

BSNL Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌భుత్వ రంగ సంస్థ భార‌త్ సంచార్ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) వివిధ విభాగాల్లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ (BSNL Recruitment) ద్వారా టెలికాం, ఫైనాన్స్ విభాగాల్లో 120 సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయ‌నుంది.

G

National | Published On Feb 6, 2026, 11.44 am IST

BSNL Recruitment | బీఎస్ఎన్‌లో ఉద్యోగాలు.. బీటెక్‌, సీఏ అర్హ‌త‌తో సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌లు
Advertisement

BSNL Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌భుత్వ రంగ సంస్థ భార‌త్ సంచార్ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) వివిధ విభాగాల్లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి క‌లిగినవారు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ రిక్రూట్‌మెంట్ (BSNL Recruitment) ద్వారా టెలికాం, ఫైనాన్స్ విభాగాల్లో 120 సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయ‌నుంది. రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది. హైద‌రాబాద్ స‌హా దేశవ్యాప్తంగా 27 కేంద్రాల్లో ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. ఎంపికైన వారు నెలకు రూ.24,900 నుంచి రూ. 50,500 వరకు జీతం పొంద‌వ‌చ్చు.

మొత్తం ఖాళీలు: 120
ఇందులో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ (టెలికాం) విభాగంలో 95, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ (ఫైనాన్స్‌) 25 చొప్పున ఉన్నాయి.

అర్హతలు: సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ (టెలికాం) పోస్టుకు 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ బ్రాంచ్‌ల‌లో ఏదోఒక‌టి బీఈ లేదా బీటెక్‌ పూర్తి చేయాలి.

సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ (ఫైనాన్స్‌) ఉద్యోగం కోసం చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ), కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ (సీఎంఏ) చేయాల్సి ఉంటుంది. ఇక అభ్యర్థులకు 30 ఏండ్ల వయసు ఉండాలి. ఓబీసీ, ఎన్‌సీఎల్‌కు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేండ్ల‌ సడలింపు ఉంటుంది.

అప్లికేష‌న్ విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1,250

ఎలా ఎంపిక చేస్తారంటే..

ఈ ఉద్యోగాల‌కు రాత ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) మల్టిపుల్ చాయిస్‌ విధానంలో ఉంటుంది. మొత్తం 200 మార్కులకు ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. 180 నిమిషాల్లో పూర్తి చేయాలి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. ఈ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. పార్ట్‌-1, పార్ట్‌-2ల్లో జనరల్‌ అభ్యర్థులు 50 శాతం, ప్రత్యేక వర్గాలకు చెందినవారు 45 శాతం కనీసార్హత మార్కులు పొందాలి.

పార్ట్‌-1 (కామన్‌): ఇందులో ఆప్టిట్యూడ్‌ టెస్టులో 40 ప్రశ్నలు ఉంటాయి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు ఒక మార్కు చొప్పున 40 మార్కులు. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, డేటా సఫిషియన్సీ రీజనింగ్‌, వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్, అనలిటిక్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పార్ట్‌-2 (టెక్నికల్‌): ఇందులో 160 ప్రశ్నలు ఉంటాయి. బేసిక్‌ టెలీకమ్యూనికేషన్స్‌ కాన్సెప్ట్స్ నుంచి 15 ప్ర‌శ్న‌లు, వైర్‌లైన్‌ టెలీకమ్యూనికేషన్స్‌ టెక్నాలజీస్ 15, వైర్‌లెస్‌ టెలి కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీస్ 15, టెలికం ట్రాన్స్‌మిషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 15, ఐపీ లేదా డేటా నెట్‌వర్క్స్ 15, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్ 10, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్ నుంచి 15 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.

పార్ట్‌-2 (ఫైనాన్స్‌): అడ్వాన్స్‌డ్‌ అకౌంటింగ్‌-15 ప్రశ్నలు, ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌-15, ట్యాక్సేషన్‌ రూల్స్‌-15, కాస్ట్‌ అకౌంటింగ్‌-15, కార్పొరేట్‌ అండ్‌ అదర్‌ లా-15, ఆడిట్‌ అండ్‌ అస్యూరెన్స్‌-15, అకౌంటింగ్‌ రిసీవబుల్‌ మేనేజ్‌మెంట్‌-10 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు.

దరఖాస్తుల‌కు చివరి తేదీ: మార్చి 7
పరీక్ష: మార్చి 29
వెబ్‌సైట్‌: www.bsnl.co.in

Advertisement
Advertisement