BPCL | బీపీసీఎల్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. మే 17 వరకు దరఖాస్తులకు గడువు
BPCL | ప్రభురంగ చమురు ఉత్పత్తి, పంపిణీ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (Junior Executive), ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
BPCL | త్రినేత్ర.న్యూస్: ప్రభురంగ చమురు ఉత్పత్తి, పంపిణీ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (Junior Executive), ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 250 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఇంజినీరింగ్, అకౌంట్స్, వేసైడ్ అమెనిటీస్, క్వాలిటీ అస్యూరెన్స్, అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్‌తోపాటు ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత కలిగిన వారు మే 17 వరకు దరఖాస్తు చేసుకోచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.30 వేల నుంచి రూ.1,20,000, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ప్రతినెల రూ.40,000-రూ.140,000 వరకు అందుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 250
ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్- ఇంజినీరింగ్ 175, అకౌంట్స్ 25, వేసైట్ అమెనిటీస్ 10, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్- క్వాలిటీ అస్యూరెన్స్ 30, అఫీషియల్ లాంగ్వేజ్ 21, సెక్యూరిటీ బీపీసీఎల్ 08
అర్హతలు
ఇంజినీరింగ్‌లో డిప్లొమా, బీకామ్, బీబీఏ, బీఎస్సీ, బీఎంఎస్, బీహెచ్ఎం, ఎమ్మెస్సీ, హిందీలో మాస్టర్స్, ఇంటర్ సీఏ, ఇంటర్ సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు 32 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.1180, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 17
వెబ్‌సైట్: https://www.bharatpetroleum.in
తాజావార్తలు
- ●Narsingi | హిట్ అండ్ రన్.. నార్సింగిలో కారు బీభత్సం.. ఆర్మీ జవాన్ మృతి
- ●Village | ఊరు ఒకటే.. కానీ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు వేర్వేరు..
- ●Varuna Yagam | నాగార్జునసాగర్‌లో వరుణ యాగం ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
- ●AAI Recruitment | ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 389 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్
- ●Horoscope | ఆగస్టు 10 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఊహించని మార్పులు ఉండవచ్చు!
- ●Free Online Education | ఆన్‌లైన్‌లో చదువు ఉచితం.. అయినా లక్షల ఫీజులు ఎందుకు కడుతున్నారు? భవిష్యత్తులో స్కూళ్లు ఉంటాయా?

Narsingi | హిట్ అండ్ రన్.. నార్సింగిలో కారు బీభత్సం.. ఆర్మీ జవాన్ మృతి

Village | ఊరు ఒకటే.. కానీ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు వేర్వేరు..

Varuna Yagam | నాగార్జునసాగర్‌లో వరుణ యాగం ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

AAI Recruitment | ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 389 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్





