త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CWC Recruitment | సెంట్ర‌ల్ వేర్‌హౌసింగ్ కార్పొరేష‌న్‌లో 327 అసిస్టెంట్ మేనేజ‌ర్‌, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

CWC Recruitment | ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన సెంట్ర‌ల్ వేర్‌హౌసింగ్ కార్పొరేష‌న్ (CWC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 327 పోస్టుల‌తో నోటిఫికేష‌న్ విడుద‌ల (CWC Recruitment) చేసింది.

G

National | Published On Oct 17, 2026, 6.22 am IST

CWC Recruitment | సెంట్ర‌ల్ వేర్‌హౌసింగ్ కార్పొరేష‌న్‌లో 327 అసిస్టెంట్ మేనేజ‌ర్‌, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
Advertisement

CWC Recruitment | త్రినేత్ర న్యూస్‌: ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన సెంట్ర‌ల్ వేర్‌హౌసింగ్ కార్పొరేష‌న్ (CWC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 327 పోస్టుల‌తో నోటిఫికేష‌న్ విడుద‌ల (CWC Recruitment) చేసింది. ఇందులో అసిస్టెంట్ మేనేజ‌ర్ (Assistant Manager), జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ (Junior Executive) వంటి పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, బీటెక్‌, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా చేసినవారు ఈ పోస్టుల‌కు అర్హులు. రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ (అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌కు) ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. అక్టోబ‌ర్ 17 నుంచి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభ‌మ‌వుతాయి. న‌వంబ‌ర్ 15 వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్ cewacor.nic.in. ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన‌వారికి ప్ర‌తినెల రూ.29 వేల నుంచి రూ.1,40,000 వ‌ర‌కు జీతం వ‌స్తుంది.

మొత్తం ఖాళీలు: 327

అసిస్టెంట్ మేనేజ‌ర్ (జ‌న‌ర‌ల్‌)- 70 (జ‌న‌ర‌ల్ 28, బీసీ 23, ఎస్సీ 9, ఎస్టీ 3, ఈడ‌బ్ల్యూఎస్ 7)
అర్హ‌త‌: పీజీ లేదా పీజీ డిప్లొమా చేసి ఉండాలి.

అసిస్టెంట్ మేనేజ‌ర్ (టెక్నిక‌ల్‌)- 60 (జ‌న‌ర‌ల్ 25, బీసీ 16, ఎస్సీ 9, ఎస్టీ 4, ఈడ‌బ్ల్యూఎస్ 6)
అర్హ‌త‌: అగ్రిక‌ల్చ‌ర్‌, ఫుడ్ టెక్నాల‌జీ, ఫుడ్ సైన్స్‌, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ, ఫుడ్ టెక్నాల‌జీ మేనేజ్‌మెంట్‌, బ‌యోటెక్నాల‌జీలో బీఈ, బీటెక్ చేసి ఉండాలి.

అసిస్టెంట్ మేనేజ‌ర్ (ఫైనాన్స్‌)- 10 (జ‌న‌ర‌ల్ 5, బీసీ 3, ఎస్టీ 1, ఈడ‌బ్ల్యూఎస్ 1)
అర్హ‌త‌: కామ‌ర్స్‌లో డిగ్రీ లేదా ఇంట‌ర్‌లో సీఏ, సీఎంఏ చేసి ఉండాలి. ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్‌లో మూడేండ్ల అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి.

అసిస్టెంట్ మేనేజ‌ర్ (సివిల్ ఇంజినీరింగ్‌)- 22 (జ‌న‌ర‌ల్ 10, బీసీ 6, ఎస్సీ 1, ఎస్టీ 1, ఈడ‌బ్ల్యూఎస్ 2)
అర్హ‌త‌: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్‌

అసిస్టెంట్ మేనేజ‌ర్ (ఎల‌క్ట్రిల్ ఇంజినీరింగ్‌)- 5 (జ‌న‌ర‌ల్ 3, బీసీ 1, ఎస్సీ 1)
అర్హ‌త‌: ఎల‌క్ట్రిల్ ఇంజినీరింగ్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌లో బీఈ, బీటెక్‌

అసిస్టెంట్ మేనేజ‌ర్ (మెకానిక‌ల్‌)- 4 (జ‌న‌ర‌ల్ 3, బీసీ 1)
అర్హ‌త‌: మెకానిక‌ల్‌ ఇంజినీరింగ్‌

జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్- 78 (జ‌న‌ర‌ల్ 34, బీసీ 21, ఎస్సీ 11, ఎస్టీ 5, ఈడ‌బ్ల్యూఎస్ 7)
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూట‌ర్ అన‌ల‌టిక్స్ తెలిసి ఉండాలి.

జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ (టెక్నిక‌ల్‌)- 78 (జ‌న‌ర‌ల్ 32, బీసీ 26, ఎస్సీ 7, ఎస్టీ 6, ఈడ‌బ్ల్యూఎస్ 7)
అర్హ‌త‌: డిగ్రీలో అగ్రిక‌ల్చ‌ర్‌, బోట‌నీ, జువాల‌జీ, బ‌యోటెక్నాల‌జీ, మైక్రోబ‌యాల‌జీ, బ‌యోకెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్‌, కెమిస్ట్రీ చ‌దివి ఉండాలి. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం త‌ప్ప‌నిస‌రి.

వ‌య‌స్సు: అన్ని పోస్టుల‌కు 18 నుంచి 28 ఏండ్ల లోపువారై ఉండాలి. 1998 న‌వంబ‌ర్ 16 నుంచి 2008 న‌వంబ‌ర్ 15 మ‌ధ్య జ‌న్మించిన వారై ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌, అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌కు ఇంట‌ర్వ్యూ కూడా ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.1350, ఎస్సీ, ఎస్టీ, మ‌హిళ‌లు, దివ్వాంగులు, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌కు రూ.500
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: అక్టోబ‌ర్ 17
ద‌ర‌ఖాస్తులకు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 15
వెబ్‌సైట్‌: www.cewacor.nic.in

Apply Online
Detailed Notification

Advertisement
Advertisement