Nepal | నేపాల్‌లో భారీ హిమపాతం.. ఆరుగురు భారతీయ పర్యాటకులు గల్లంతు
Nepal | నేపాల్ (Nepal)లో ఆరుగురు భారతీయ పర్యాటకులు గల్లంతయ్యారు (Indians Missing). డోల్పా (Dolpa) జిల్లాలోని ప్రసిద్ధ షే ఫోక్సుండో సరస్సు (Shey-Phoksundo Lake) వైపు ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో భారీ హిమపాతం (heavy snowfall) కారణంగా వారు అక్కడ చిక్కుకుపోయారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. నేపాల్ సైనిక బృందాన్ని రంగంలోకి దించారు.
Nepal | త్రినేత్ర న్యూస్ : నేపాల్ (Nepal)లో ఆరుగురు భారతీయ పర్యాటకులు గల్లంతయ్యారు (Indians Missing). డోల్పా (Dolpa) జిల్లాలోని ప్రసిద్ధ షే ఫోక్సుండో సరస్సు (Shey-Phoksundo Lake) వైపు ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో వారి ఆచూకీ గల్లంతైంది. సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. నేపాల్ సైనిక బృందాన్ని రంగంలోకి దించారు.
అధికారిక సమాచారం ప్రకారం.. నలుగురు పరుషులు, ఇద్దరు మహిళలతో కూడిన బృందం డోల్పా నుంచి షే ఫోక్సుండో సరస్సు వైపు ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో నుమా లా, బగా లా పాస్ ప్రాంతంలో (Numa La and Baga La pass areas) వారి ఆచూకీ గల్లంతైంది. హిమాలయ ప్రాంతంలో భారీ హిమపాతం (heavy snowfall) కారణంగా వారు ఈ రెండు కొండల మార్గాల వద్ద చిక్కుకుపోయి ఉంటారని స్థానిక గైడ్‌లు అనుమానిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుపాను ప్రభావం వల్లే అక్కడ భారీ స్థాయిలో హిమపాతం సంభవించినట్లుగా భావిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా లేదని, పర్వత కనుమలను దాటడం కష్టమని స్థానికులు ముందుగానే హెచ్చరించినప్పటికీ వారు ఆ హెచ్చరికలను పెడచెవినపెట్టి తమ ప్రయాణాన్ని కొనసాగించినట్లు అధికారులు తెలిపారు. తిరిగి వస్తున్న సమయంలోనే మంచులో చిక్కుకుపోయి ఉంటారని పేర్కొన్నారు.
గాలింపు చర్యల కోసం హెలికాప్టర్
గల్లంతైన ఆరుగురు భారతీయ పర్యాటకుల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదని డోల్పా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) అనిల్ రాజ్ గిరి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌కు సహకరించేలా హెలికాప్టర్‌ను సమకూర్చాలని సంబంధిత అధికారులను కోరినట్లు వెల్లడించారు. అయితే, ఎత్తైన హిమాలయ ప్రాంతంలో కురుస్తున్న భారీ హిమపాతం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దట్టమైన మంచు కురుస్తుండటంతో పాటు ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల పర్యాటకులను సంప్రదించడం అధికారులకు సవాలుగా మారింది. దీంతో పర్యాటకుల ఆచూకీ కనిపెట్టి, వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఆర్మీని రంగంలోకి దింపినట్లు డోల్పా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ జును హమల్ తెలిపారు.
అప్పర్ డోల్పాకు 244 మంది పర్యాటకులు
ప్రస్తుతం అప్పర్ డోల్పా ప్రాంతానికి మొత్తం 244 మంది పర్యటకులు చేరుకున్నట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది. వీరిలో 149 మంది నేపాల్ పౌరులు కాగా, 44 మంది సార్క్ దేశాలకు చెందినవారు ఉన్నారు. మరో 51 మంది ఇతర విదేశీ పౌరులు. తాజా ఘటన నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని జిల్లా యంత్రాంగం వారికి సూచించింది. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని పర్యటకులకు విజ్ఞప్తి చేసింది.
Also Read..
దీపావళి పండుగ వేళ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి..
నవంబర్‌లో సూర్యుడి సంచారం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుందంటే!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Border Trade | టిబెట్‌లో భారీగా హిమపాతం.. భారత్-చైనా సరిహద్దుల్లో నిలిచిన వాణిజ్యం
సెప్టెంబర్ 27, 2026

Nepal Flash Floods | ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ
సెప్టెంబర్ 8, 2026

Nepal Floods | నేపాల్ వరదల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులు
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Gas Cylinder Price | దీపావళి పండుగ వేళ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- ●Vikarabad | ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి..
- ●November Horoscope 2026 | నవంబర్‌లో సూర్యుడి సంచారం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుందంటే!
- ●Municipal Elections | ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్
- ●Warren Buffett | 48 ఏండ్లుగా ఒక్క గ్లాస్ మంచి నీళ్లు ముట్టని వారెన్ బఫెట్
- ●Horoscope | నవంబర్ 1 ఆదివారం.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Gas Cylinder Price | దీపావళి పండుగ వేళ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

Vikarabad | ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి..

November Horoscope 2026 | నవంబర్‌లో సూర్యుడి సంచారం.. 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుందంటే!

Municipal Elections | ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్



