Heavy Snowfall | ఎటుచూసినా హిమపాతమే.. కశ్మీర్‌ను కమ్మేసిన మంచు దుప్పటి
Heavy Snowfall | జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) సరికొత్త అందాలను సంతరించుకున్నది. కశ్మీర్ లోయతోపాటు జమ్ములోని చాలా ప్రాంతాలను మంచు దుప్పటి (Heavy Snowfall) కమ్మేసింది. కనుచూపు మేరలో ఎటుచూసినా హిమపాతం దర్శనమిస్తున్నది. ఇండ్లు, వాహనాలు, రోడ్లు, పర్వతాలు, ఇలా ఎక్కడ చూసినా తెల్లటి దుప్పటి పరిచినట్లు మంచు (snow) కప్పేయడంతో ప్రకృతి అందాలకు నెలవైన కశ్మీరం మరింత సుందరంగా కనిపిస్తుంది.
త్రినేత్ర.న్యూస్: జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) సరికొత్త అందాలను సంతరించుకున్నది. కశ్మీర్ లోయతోపాటు జమ్ములోని చాలా ప్రాంతాలను మంచు దుప్పటి (Heavy snowfall) కమ్మేసింది. కనుచూపు మేరలో ఎటుచూసినా హిమపాతం దర్శనమిస్తున్నది. ఇండ్లు, వాహనాలు, రోడ్లు, పర్వతాలు, ఇలా ఎక్కడ చూసినా తెల్లటి దుప్పటి పరిచినట్లు మంచు (snow) కప్పేయడంతో ప్రకృతి అందాలకు నెలవైన కశ్మీరం మరింత సుందరంగా కనిపిస్తుంది.

గుల్మార్గ్ స్కీ రిసార్ట్, కుప్వారా, బారాముల్లా, షోపియన్‌లోని ఎత్తయిన ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుండటంతో అవి శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. రోడ్లు, పొలాలు, ఇండ్ల పైకప్పులపై మంచు తెల్లటి మంచు కుప్పలుగా పేరుకుపోవడంతో నివాసులు, పర్యాటకులు.. ఆ సుందర దృశ్యాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. సన్నని దూది పింజాల్లా రాలుతున్న మంచును యాత్రికులు ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే పలు ప్రధాన రహదారులను మంచు ముంచెత్తడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతన్నారు. కశ్మీర్ లోయలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాకులపై భారీగా మంచు పేరుకుపోవడంతో పలు ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ దెబ్బతింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో భారీగా మంచు కురుస్తున్నది. సిమ్లాలో నిరంతరాయంగా మంచు వర్షం పడుతూనే ఉన్నది.




https://x.com/ANI/status/2014536048836280776?s=20
తాజావార్తలు
- ●Kavitha | జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంతుకమ్మ వేడుకలు: కవిత
- ●Short Circuit | పేలిన ప్రిజ్.. కాలి బూడిదైన రూ.20 లక్షల నగదు
- ●Border Trade | టిబెట్‌లో భారీగా హిమపాతం.. భారత్-చైనా సరిహద్దుల్లో నిలిచిన వాణిజ్యం
- ●Tyre Burst | హైవేపై కారు టైర్ పంచర్.. ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రాణాపాయం.. వీడియో
- ●KTR | అస్థిత్వం కోసం ఆరాటం.. అణిచివేత పై పోరాటం.. నాని ‘ది ప్యారడైజ్’పై కేటీఆర్ రివ్యూ..
- ●Horoscope | సెప్టెంబర్ 27 రాశిఫలాలు.. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి!

Kavitha | జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంతుకమ్మ వేడుకలు: కవిత

Short Circuit | పేలిన ప్రిజ్.. కాలి బూడిదైన రూ.20 లక్షల నగదు

Border Trade | టిబెట్‌లో భారీగా హిమపాతం.. భారత్-చైనా సరిహద్దుల్లో నిలిచిన వాణిజ్యం

Tyre Burst | హైవేపై కారు టైర్ పంచర్.. ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రాణాపాయం.. వీడియో





