త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ritu Tawde | ముంబై మేయ‌ర్ అభ్య‌ర్థిగా రితూ తావ్డే నామినేష‌న్‌

Ritu Tawde | ముంబై మేయ‌ర్ (Mumbai Mayor) అభ్య‌ర్థిగా బీజేపీకి (BJP) చెందిన‌ రితూ తావ్డే (Ritu Tawde) నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

D

National | Published On Feb 7, 2026, 3.19 pm IST

Ritu Tawde | ముంబై మేయ‌ర్ అభ్య‌ర్థిగా రితూ తావ్డే నామినేష‌న్‌
Advertisement

Ritu Tawde | ముంబై మేయ‌ర్ (Mumbai Mayor) అభ్య‌ర్థిగా బీజేపీకి (BJP) చెందిన‌ రితూ తావ్డే (Ritu Tawde) నామినేష‌న్ దాఖ‌లు చేశారు. డిప్యూటీ మేయ‌ర్‌గా శివ‌సేన‌కు చెందిన సంజ‌య్ శంక‌ర్ ఘాడి నామినేష‌న్ వేశారు. ఈ నెల 11న మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఎన్నిక జరగనుంది.

బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి మహాయుతి కూటమిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ కూటమి మెజారిటీ స్థానాలు సంపాదించింది. 227 స్థానాలున్న బీఎంసీలో మహాయుతి కూటమి 118 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో బీజేపీ 89 సీట్లు, శివసేన (షిండే) 29 సీట్లు గెలుచుకుంది. మేయర్‌గా పోటీ పడుతున్న రితూ తావ్డే 132 వ వార్డు అయిన ఘట్కోపర్ నుంచి గెలుపొందారు. ఆమె ఇప్పటివరకు ఘాట్కోపర్ వెస్ట్ నుంచి మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ విద్యా క‌మిటీ అధ్య‌క్షురాలిగా కూడా ప‌నిచేశారు.

తొమ్మిదేళ్ల త‌ర్వాత ఎన్నిక‌లు..

రితూ తావ్డే గతంలో కాంగ్రెస్‌లో ఉండేవారు. 2012లో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. బీఎంసీ దేశంలోనే అతిపెద్ద స్థానిక సంస్థ (కార్పొరేషన్). ఈ సంస్థ గత ఏడాది బడ్జెట్ రూ.74,450 కోట్లుగా ఉంది. బీఎంసీకి తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికలు జరగడం విశేషం.

Advertisement
Advertisement