త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alia Bhatt | ఆర్ఆర్ఆర్ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమాలో ఆలియా – ఎన్టీఆర్ డ్రాగ‌న్‌పై క్రేజీ రూమ‌ర్ వైర‌ల్‌

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఆలియా భ‌ట్ తెలుగులో మ‌రో సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న డ్రాగ‌న్‌లో ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Apr 14, 2026, 1.16 pm IST

Alia Bhatt | ఆర్ఆర్ఆర్ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమాలో ఆలియా – ఎన్టీఆర్ డ్రాగ‌న్‌పై క్రేజీ రూమ‌ర్ వైర‌ల్‌
Advertisement

Alia Bhatt |  ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్‌. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా సీత పాత్ర‌లో ఆలియా క‌నిపించింది. గ్లామ‌ర్ హంగులు లేని ఎమోష‌న‌ల్ రోల్‌లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో ఆలియాకు తెలుగులో చాలానే ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ హిందీ సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో ఆ అవ‌కాశాల‌ను రిజెక్ట్ చేసింది.

డ్రాగ‌న్‌లో...

తాజాగా ఆలియా భ‌ట్ తెలుగులో మ‌రో సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్టీఆర్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న‌ డ్రాగ‌న్‌లో ఓ కీల‌క పాత్ర‌లో ఆలియా క‌నిపించ‌నున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. క‌థ‌ను మ‌లుపుతిప్పే ప‌వ‌ర్‌ఫుల్ రోల్ కోసం మేక‌ర్స్ ఈ బాలీవుడ్ బ్యూటీని సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత మ‌రోసారి ఎన్టీఆర్‌తో ఆలియా సినిమా చేయ‌బోతుండ‌టం టాలీవుడ్ స‌ర్కిల్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది. త్వ‌ర‌లోనే ఆలియా రోల్‌పై క్లారిటీ రానున్న‌ట్లు చెబుతున్నారు.

ఫిజిక‌ల్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌...

డ్రాగ‌న్ మూవీలో కాంతార ఛాప్ట‌ర్ వ‌న్ ఫేమ్ రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ బుధ‌వారం నుంచి హైద‌రాబాద్‌లో మొద‌లుకాబోతుంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ను షూట్ చేయ‌బోతున్నారు ప్ర‌శాంత్ నీల్‌. ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం ఎన్టీఆర్ ఫిజిక‌ల్‌గా మేకోవ‌ర్ అయ్యారు. బీస్ట్ మోడ్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఎన్టీఆర్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ చూసి ఫ్యాన్స్ షాక‌వుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మేక‌ర్స్ అభిమానుల‌తో పంచుకున్నారు.

బాలీవుడ్‌లో రెండు సినిమాలు....

డ్రాగ‌న్ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోలు షాహిద్ క‌పూర్‌, వివేక్ ఒబెరాయ్‌ల‌లో ఒక‌రు విల‌న్‌గా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.
కాగా ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఆల్ఫాతో పాటు ల‌వ్ అండ్ వార్ సినిమాలు చేస్తోంది. అల్పా సినిమా స్పై యాక్ష‌న్ క‌థ‌తో తెర‌కెక్కుతోండ‌గా...ల‌వ్ అండ్ వార్ సినిమాను రొమాంటిక్ యాక్ష‌న్ డ్రామాగా డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కిస్తోన్నారు.

Advertisement
Advertisement