త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Youth Congress | బీజేపీ రాష్ట్ర కార్యాల‌య ముట్ట‌డికి యూత్‌ కాంగ్రెస్ య‌త్నం.. తీవ్ర ఉద్రిక్త‌త‌

Youth Congress | యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు త‌ర‌లి రావ‌డంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.

S

Flash news | Published On Aug 31, 2026, 2.59 pm IST

Youth Congress | బీజేపీ రాష్ట్ర కార్యాల‌య ముట్ట‌డికి యూత్‌ కాంగ్రెస్ య‌త్నం.. తీవ్ర ఉద్రిక్త‌త‌
Advertisement
  • అమిత్ షా దిష్టిబొమ్మ ద‌హ‌నం.. ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్

Youth Congress | త్రినేత్ర‌.న్యూస్‌: యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు త‌ర‌లి రావ‌డంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం వద్ద హైటెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మ‌ల్లికార్జున ఖర్గేపై బీజేపీ వ్యవహరించిన తీరుపై వారు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించిన ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు.

బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర కార్యాలయానికి నల్ల రంగులు పూసి నిరసన తెలిపారు. ఆఫీస్ ఎదుటే బీజేపీ పార్టీ జెండాతో పాటు అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు నిరసనను అడ్డుకుని జక్కిడి శివ చరణ్ రెడ్డితో పాటు పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement
Advertisement