Bhagyashree Borse | బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ కాదని.. క్లారిటీ ఇచ్చిన టీ సిరీస్..!
Bhagyashree Borse | యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే పేరు ఇటీవల ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించనుందని వార్తలు వచ్చాయి. ఆదిత్య రాయ్ కపూర్ కథానాయకుడిగా మిలాప్ జవేరీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైందని ప్రచారం జరిగింది. టీ-సిరీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన ఈ వార్తలపై తాజాగా నిర్మాణ సంస్థ స్పష్టత ఇచ్చింది.
Entertainment | Published On Aug 22, 2026, 3.23 pm IST
Bhagyashree Borse | యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే పేరు ఇటీవల ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించనుందని వార్తలు వచ్చాయి. ఆదిత్య రాయ్ కపూర్ కథానాయకుడిగా మిలాప్ జవేరీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైందని ప్రచారం జరిగింది. టీ-సిరీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన ఈ వార్తలపై తాజాగా నిర్మాణ సంస్థ స్పష్టత ఇచ్చింది. భాగ్యశ్రీ బోర్సే ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోవడం లేదని టీ-సిరీస్ ప్రతినిధి వెల్లడించారు. త్వరలోనే కథానాయిక ఎవరనేది అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. దీంతో ఈ సినిమాలో భాగ్యశ్రీ నటించనున్నారంటూ వచ్చిన వార్తలకు తెరపడింది. అయితే.. ఈ ప్రాజెక్ట్‌తో భాగ్యశ్రీ పేరు ఎలా తెరపైకి వచ్చిందన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె ఈ సినిమాలో నటిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకముందే చర్చ మొదలైంది. తాజాగా టీ-సిరీస్ ఇచ్చిన స్పష్టతతో ఆమెకు ఈ ప్రాజెక్ట్ లేదనేది తేలిపోయింది.
మోడలింగ్ నుంచి సినిమాల్లోకి..
భాగ్యశ్రీ బోర్సే మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది. హిందీలో వచ్చిన ‘యారియాన్ 2’ (2023)లో అతిథి పాత్రతో తెరపై తళుక్కుమన్నది. ఆ తర్వాత ‘చందూ ఛాంపియన్’లోనూ చిన్న పాత్రలో మెరిసింది. తెలుగులో రవితేజ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో జిక్కీ పాత్రలో కనిపించిన ఆమెకు తొలి సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రానికి గాను సైమా ఉత్తమ నూతన నటి (తెలుగు) అవార్డును కూడా అందుకున్నది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘కింగ్‌డమ్’లో కనిపించింది. అలాగే, దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘కాంతా’లో కనిపించారు. రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలుకా’లోనూ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.
‘లెనిన్’తో తొలి విజయం..
వరుస సినిమాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన భాగ్యశ్రీకి ‘లెనిన్’తో ఆ లోటు తీరింది. అఖిల్ అక్కినేని సరసన భారతి పాత్రలో నటించిన ఆమెకు ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భాగ్యశ్రీ నటనకు ప్రశంసలు దక్కాయి. ‘లెనిన్’ విజయంతో తన కెరీర్‌లో కొత్త ఉత్సాహం వచ్చిందని భాగ్యశ్రీ కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా భారతి పాత్ర తనకు ఎంతో ప్రత్యేకమని, ఈ పాత్ర ఎప్పటికీ తనతో ఉంటుందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం భాగ్యశ్రీ తమిళ చిత్రసీమపైనా దృష్టి పెట్టింది. శివకార్తికేయన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సెయోన్’లో ఆమె నటిస్తున్నది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | పాలకులను నిలదీసే పత్రికా స్వేచ్ఛ ఉండాలి.. విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకూ ఉండాలి
- ●Kalyana Lakshmi & Shaadi Mubarak | కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్స్ బంద్ అవుతున్నాయా? మంత్రి పొన్నం కీలక ప్రకటన
- ●Art of Living | ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు భారీ ఊరట.. ఆ రూ.5 కోట్లు తిరిగిచ్చేయాలంటూ సుప్రీం ఆదేశం
- ●Devi Prasad | మూడేండ్లలో ఒక్క డీఏ ఇవ్వలే.. ఇగ పీఆర్సీ అయితే ఊసే లేదు
- ●Canada | కెనడా సంచలన నిర్ణయం.. అమెరికాతో వాణిజ్య చర్చలు నిలిపివేత
- ●Kaaka Movie | ‘కాకా’గా చిరంజీవి.. డబుల్ షేడ్స్‌లో మెగాస్టార్ అదుర్స్..!

Bhatti Vikramarka | పాలకులను నిలదీసే పత్రికా స్వేచ్ఛ ఉండాలి.. విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకూ ఉండాలి

Kalyana Lakshmi & Shaadi Mubarak | కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్స్ బంద్ అవుతున్నాయా? మంత్రి పొన్నం కీలక ప్రకటన

Art of Living | ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు భారీ ఊరట.. ఆ రూ.5 కోట్లు తిరిగిచ్చేయాలంటూ సుప్రీం ఆదేశం

Devi Prasad | మూడేండ్లలో ఒక్క డీఏ ఇవ్వలే.. ఇగ పీఆర్సీ అయితే ఊసే లేదు






