త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Seva Pakhwada | మోదీ సిల్వర్ జూబ్లీ వేళ.. దేశ‌వ్యాప్తంగా బీజేపీ సేవా పఖ్వాడా

Seva Pakhwada | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రాజ్యాంగబద్ధమైన ప్రజా జీవితంలోకి వ‌చ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సంద‌ర్భంగా బీజేపీ (BJP) సెప్టెంబ‌ర్ 17 నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కూ దేశ‌వ్యాప్తంగా భారీ ఎత్తున సేవా పఖ్వాడా (Seva Pakhwada) కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నుంది.

D

National | Published On Aug 22, 2026, 3.21 pm IST

Seva Pakhwada | మోదీ సిల్వర్ జూబ్లీ వేళ.. దేశ‌వ్యాప్తంగా బీజేపీ సేవా పఖ్వాడా
Advertisement

Seva Pakhwada | త్రినేత్ర‌.న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రజా జీవితంలోకి (public office) అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టింది. సెప్టెంబ‌ర్ 17 నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కూ దేశ‌వ్యాప్తంగా భారీ ఎత్తున‌ సేవా పక్షం (Seva Pakhwada) (సేవా పఖ్వాడా) కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేస్తోంది.

దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు 'సేవా సంకల్స్‌ మహోత్సవం' (Seva Sankalp Mahotsav) పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య, రక్తదాన, ఆరోగ్య శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలు వంటి వివిధ ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప్రచార కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేకు అప్పగించారు. కార్యక్రమాలను సమన్వయం చేయడానికి ప్రతి రాష్ట్రంలోనూ ఒక మంత్రి, ఒక సంస్థాగత ప్రధాన కార్యదర్శి, ఐదుగురు సీనియర్ నాయకులతో కూడిన ఏడుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు.

కాగా, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అక్టోబ‌ర్ 7, 2001న తొలిసారి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. 2014 వ‌ర‌కూ గుజ‌రాత్ సీఎంగానే కొన‌సాగారు. అనంత‌రం 2014 మే 26న భార‌త ప్ర‌ధాన మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అప్ప‌టి నుంచి వ‌రుస‌గా మూడో ప‌ర్యాయం ఆయ‌న ప్ర‌ధానిగా కొనసాగుతూ దేశాన్ని ముందుకు న‌డిపిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబ‌ర్ 7 నాటికి మోదీ రాజ్యాంగబద్ధమైన ప్ర‌జా జీవితంలోకి వ‌చ్చి 25 ఏళ్లు పూర్తి కానుంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ సేవా ప‌క్షం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌బోతోంది.

Also Read..

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు భారీ ఊర‌ట‌.. ఆ రూ.5 కోట్లు తిరిగిచ్చేయాలంటూ సుప్రీం ఆదేశం

పాలకులను నిలదీసే పత్రికా స్వేచ్ఛ ఉండాలి.. విమ‌ర్శ‌ల‌ను స్వీక‌రించే ధైర్యం ప్ర‌భుత్వాల‌కూ ఉండాలి

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్స్‌ బంద్ అవుతున్నాయా? మంత్రి పొన్నం కీలక ప్రకటన

Advertisement
Advertisement