త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Venkata Ramana Reddy | ఇందిర‌మ్మ ఇండ్ల స్కీంలో స‌ర్పంచ్‌ల పాత్ర ఏంటి..? : ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి

MLA Venkata Ramana Reddy | రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇండ్ల స్కీంలో స‌ర్పంచ్‌ల పాత్రం ఏంటి..? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణారెడ్డి ప్ర‌శ్నించారు. ఇక అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను ఎప్పుడు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తార‌ని అడిగారు.

S

Telangana | Published On Mar 25, 2026, 11.46 am IST

MLA Venkata Ramana Reddy | ఇందిర‌మ్మ ఇండ్ల స్కీంలో స‌ర్పంచ్‌ల పాత్ర ఏంటి..? : ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి
Advertisement

MLA Venkata Ramana Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇండ్ల స్కీంలో స‌ర్పంచ్‌ల పాత్రం ఏంటి..? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణారెడ్డి ప్ర‌శ్నించారు. ఇక అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను ఎప్పుడు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తార‌ని అడిగారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణారెడ్డి మాట్లాడారు.

డబుల్ బెడ్రూం ఇండ్లపై గ‌తంలో నేను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు స‌మాధానం ఇవ్వ‌లేదు. గ‌త ప్ర‌భుత్వం కేటాయించిన డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌లో నాణ్య‌త లోపం ఉంది. స్లాబ్‌లు ప‌గిలిపోతున్నాయి. అద్దాలు ప‌గిలిపోయాయి. అంతేకాకుండా అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌లో అసాంఘిక కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయి. వీటి మీద ఇప్ప‌టి వ‌ర‌కు స‌మాధానం ఇవ్వ‌లేదు. అయితే డ‌బుల్ బెడ్రూం ఇండ్ల మ‌ర‌మ్మ‌తుల విష‌యంలో ఆల‌స్యం జ‌రిగితే ప్ర‌భుత్వం మీద భారం ప‌డుతుందే త‌ప్ప ప్ర‌జ‌ల‌కు లాభం అయ్యే ఛాన్స్ లేదు. ఎంత త్వ‌ర‌గా పూర్తి చేస్తే అంత మంచిది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ స్కీం ఇందిర‌మ్మ ఇండ్లుగా మారింది. గ్రామాల్లో ఇండ్లు నిర్మాణం అవుతున్నాయి. వాటిపై నేను కామెంట్ చేయ‌ద‌ల‌చుకోలేదు. ఇక ఇందిర‌మ్మ ఇండ్ల‌ను నిజ‌మైన అర్హుల‌కు ఇస్తే బాగుంటుంది. గ‌తంలో ప్ర‌జాప్ర‌తినిధుల‌కు సంబంధించిన వారికి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించి, అక్ర‌మాల‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఇప్పుడు ఇందిర‌మ్మ క‌మిటీ ద్వారా రెవెన్యూ, ఎమ్మార్వోల మీద ఒత్తిడి జ‌రుగుతుంది. అధికారుల‌కు మీ మ‌ద్ద‌తు అవ‌స‌రం. అర్హుల‌కు ఇండ్లు వ‌స్తే ప్ర‌భుత్వానికి మంచి పేరు వ‌స్త‌ది. విజ‌యం క‌లుగుతుంది. అవినీతికి పాల్ప‌డితే ఎలాంటి ప‌రిణామాలు ఎదుక్కోవాల్సి వ‌స్త‌దో మీకు చెప్పాల్సిన అస‌వ‌రం లేదు అని ఆయ‌న అన్నారు.

డ‌బుల్ బెడ్రూం ఇండ్ల స్కీంలో కేంద్ర ప్ర‌భుత్వం పాత్ర ఏందో చెప్పాల‌ని కోరుతున్నాం. స‌ర్పంచ్‌లు లేన‌ప్పుడు ఇందిర‌మ్మ ఇండ్ల‌ను కేటాయించారు. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగాయి. మ‌రి ఇప్పుడు ఇందిర‌మ్మ ఇండ్ల పంపిణీలో స‌ర్పంచ్‌ల పాత్ర ఏంటి...? వారికి ఏం హ‌క్కు ఉంది. ఇందిర‌మ్మ ఇండ్ల పంపిణీలో వారి అధికారం ఏంటో చెప్పాల‌ని కోరుతున్న‌ట్లు ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement