Sukesh Chandrashekhar | ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు బెయిల్.. అయినా జైలులోనే..!
Sukesh Chandrashekhar | రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. సరైన కారణాలు లేకుండా దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉంచడం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు అభిప్రాయపడింది.
Sukesh Chandrashekhar | రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. సరైన కారణాలు లేకుండా దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉంచడం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా బెయిల్‌కు పలు షరతులు విధించింది. రూ.5లక్షల వ్యక్తిగత బాండ్‌తో పాటు అదే మొత్తంలో మరో ష్యూరిటని సమర్పించాలని ఆదేశించింది. కేసులో సాక్షులను ప్రభావితం చేయడం, వారిని కలవకూడదని స్పష్టం చేసింది. అడ్రస్, మొబైల్ నంబర్‌ను దర్యాప్తు అధికారికి అందజేయాలని, పాస్‌పోర్టును కోర్టులో జమ చేయాలని, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.
రూ.200కోట్ల మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుకేశ్ చంద్రశేఖర్‌తో పాటు అతని భార్య లీనా మరియా పాల్ సహా పలువురిపై ఎంసీవోసీఏ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఏఐఏడీఎంకే నేత టిటివి ధినకరన్‌కు మధ్యవర్తిగా సుకేశ్ వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల గుర్తు పొందేందుకు భారత ఎన్నికల సంఘం అధికారిని లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లుగా కేసు నమోదైంది. ఈ సందర్భంగా రూ.1.3కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. సుకేశ్‌కు బెయిల్ మంజూరైనప్పటికీ వెంటనే జైలు వచ్చేందుకు అవకాశం లేదు. మొత్తం 31 క్రిమినల్ కేసులు అతనిపై నమోదయ్యాయి. అందులో 26 కేసుల్లో ఇప్పటికే బెయిల్ మంజూరైంది. మరో ఐదు కేసులు ఇంకా పెండింగ్‌లో ఉండడంతో జైలులోనే ఉండాల్సి రానుంది. ఈ కేసులో బెయిల్ దొరికినా.. జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం దొరకలేదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nidhhi Agerwal | బెట్టింగ్ యాప్స్ కేసు.. నిధి అగర్వాల్‌ను విచారించిన ఈడీ
ఆగస్టు 19, 2026

Brij Bhushan Sharan Singh | రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీ హైకోర్టు భారీ ఊరట
ఆగస్టు 3, 2026

Raju Kumar Singh | వైద్యురాలి మృతి కేసు.. బీజేపీ ఎమ్మెల్యేకి నాలుగేళ్లు జైలు శిక్ష
జులై 4, 2026
తాజావార్తలు
- ●Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు
- ●Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!
- ●CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ
- ●MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ
- ●Oil Palm Hub | సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి
- ●Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం

Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు

Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!

CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ

MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ



