Travel Advisory | థాయ్‌లాండ్ వెళ్దామనుకుంటున్నారా..? మీ కోసమే ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ..!
Travel Advisory | ప్రముఖ పర్యాటక ప్రాంతమైన థాయ్‌లాండ్‌కు భారత్ నుంచి చాలామంది వెళ్తుంటారు. ఇప్పటి వరకు ఆ దేశానికి వెళ్లేందుకు వీసా ఫ్రీ ఎంట్రీ ఉండేది. దాంతో ఆ దేశంలోకి సులభంగా ప్రవేశించేందుకు అవకాశం ఉండేది. అయితే, ఆ విధానాన్ని ఆ దేశం నిలిపివేసింది.
Travel Advisory | ప్రముఖ పర్యాటక ప్రాంతమైన థాయ్‌లాండ్‌కు భారత్ నుంచి చాలామంది వెళ్తుంటారు. ఇప్పటి వరకు ఆ దేశానికి వెళ్లేందుకు వీసా ఫ్రీ ఎంట్రీ ఉండేది. దాంతో ఆ దేశంలోకి సులభంగా ప్రవేశించేందుకు అవకాశం ఉండేది. అయితే, ఆ విధానాన్ని ఆ దేశం నిలిపివేసింది. కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో థాయ్‌లాండ్ వెళ్లాలనుకుంటున్న పర్యాటకులకు ఇండియన్ ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది. తప్పనిసరిగా నిబంధనలు పాటించాలంటూ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ప్రయాణానికి ముందు అవసరమైన పత్రాలు, వీసా నిబంధనలు, ఆర్థిక ప్రమాణాలపై స్పష్టమైన సూచనలు చేసింది.
తప్పనిసరి నిబంధనలు..
ఎంబసీ సూచనల ప్రకారం.. థాయ్‌లాండ్ వెళ్లే భారతీయ ప్రయాణికులు తప్పనిసరిగా కనీసం ఆరు నెలల కాలపరిమితి ఉన్న పాస్‌పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే, రిటర్న్ టికెట్స్, హోటల్ బుకింగ్స్, మీ పర్యటనకు సంబంధించిన పూర్తి ప్రణాళిక మీ వద్ద ఉండాలి. అలాగే, జర్నీకి ముందు 72గంటల్లోగా థాయ్‌లాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ (TDAC) ఆన్‌లైన్ ఫారమ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ తర్వాత లభించే క్యూఆర్ కోడ్‌ను ఇమిగ్రేషన్ వద్ద చూపించాల్సిన అవసరం ఉంటుంది. పర్యటనకు అనుగుణంగా వీసా తీసుకోవాలని ఎంబసీ సూచించింది. వీసా వేవర్, వీసా ఆన్ అరైవల్ సౌకర్యం వినియోగించుకునే ప్రయాణికులు ఒక్కొక్కరి వద్ద కనీసం 20వేల థాయ్‌బాట్స్ (భారతీయ కరెన్సీలో రూ.57,446) నగదు ఉండాలని తెలిపింది. అవసరమైతే ఇమిగ్రేషన్ అధికారులు ఫైనాన్షియల్ స్టేటస్‌పై ప్రశ్నలు వేయొచ్చని హెచ్చరించింది.
ట్రాన్సిట్ ప్రయాణికులకు హెచ్చరికలు
థాయ్‌లాండ్‌లో ఉద్యోగం కోసం వెళ్తున్న వారు టూరిజం వీసా రావొద్దని ఎంబసీ స్పష్టం చేసింది. ఉద్యోగం కోసం వెళ్లే వారు తప్పనిసరిగా సరైన వీసా తీసుకోవాలని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఇతర దేశాలకు ట్రాన్సిట్‌లో థాయ్‌లాండ్ మీదుగా వెళ్లే ప్రయాణికులు, తుది గమ్యస్థానానికి సంబంధించిన అన్ని పత్రాలు, వీసాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించింది. ప్రయాణానికి ముందు అన్ని నిబంధనల గురించి అవగాహన కలిగి ఉండాలని, అప్పుడు థాయ్‌లాండ్ పర్యటన సాఫీగా సాగుతుందని ఎంబసీ సూచించింది.
ఎంబసీ కీలక సూచనలు
- కనీసం ఆరు నెలల వాలిడిటీ ఉన్న పాస్‌పోర్ట్ ఉండాలి
- రిటర్న్ టికెట్లు తప్పనిసరి
- హోటల్ బుకింగ్స్ తప్పనిసరి
- పూర్తి ట్రావెల్ షెడ్యూల్ సిద్ధంగా ఉంచుకోవాలి
- ప్రయాణానికి 72 గంటలలో TDAC ఫారమ్ నింపాలి
- జర్నీకి అనువైన వీసా తీసుకోవాలి
- వీసా వేవర్/ఆన్ అరైవల్ కింద ప్రయాణిస్తే కనీసం 20వేల థాయ్ బాట్స్ ఉండాలి
- ఇమిగ్రేషన్ చెకింగ్ సమయంలో అన్నిపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి
- గ్రూప్‌లోని ప్రతి ప్రయాణికుడి వద్ద వేరువేరు పత్రాలు ఉండాలి
- ఉద్యోగాల కోసం థాయ్‌లాండ్ వెళ్తే టూరిస్ట్ వీసాపై వెళ్లకూడదు
- ట్రాన్సిట్ ప్రయాణికులైతే చివరి గమ్యస్థానానికి సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలి
Advisory for Indian nationals visiting Thailand. pic.twitter.com/wEAMyH7H0D
— India in Thailand (@IndiainThailand) July 2, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు






