Kiara Advani | టాక్సిక్ కోసం కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? – నయనతారను బీట్ చేసిందిగా!
యశ్ టాక్సిక్ మూవీ కోసం కియారా అద్వానీ తీసుకున్న రెమ్యూనరేషన్ దక్షిణాది వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ గ్యాంగ్‌స్టర్ మూవీలో బోల్డ్ రోల్ చేసినందుకు కియారా పదిహేను కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార కంటే కియారానే ఎక్కువగా పారితోషికం అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Kiara Advani | యశ్ టాక్సిక్ రిలీజ్ కోసం పాన్ ఇండియన్ వైడ్‌గా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్ట్ 26న థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే టాక్సిక్ రెండు సార్లు వాయిదాపడటంతో ఈ సారి అయినా రిలీజ్ అవుతుందా? లేదా? అనే అనుమానం ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతోంది.
టాక్సిక్ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తోన్నారు. నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియాతో పాటు హ్యుమా ఖురేషి కథానాయికలుగా కనిపించబోతున్నారు. ఇటీవలే హీరోయిన్ల పాత్రలకు సంబంధించి ఓ స్పెషల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
బోల్డ్ రోల్...
ఇందులో కియారా అద్వానీ బోల్డ్ రోల్‌లో కనిపించగా...మిగిలిన నలుగురు హీరోయిన్లు యాక్షన్ క్యారెక్టర్లలో కనిపించారు. ఈ ఐదుగురు హీరోయిన్లలో రెమ్యూనరేషన్ పరంగా కియారా అద్వానీనే టాప్ అని ప్రచారం జరుగుతోంది. టాక్సిక్ కోసం కియారా ఏకంగా పదిహేను కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. బోల్డ్ రోల్ కావడం, బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ కూడా ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చారట. గేమ్ ఛేంజర్ సినిమాకు కియారా ఏడు కోట్ల వరకు పారితోషికం స్వీకరించిందట. టాక్సిక్ కోసం మాత్రం డబుల్ చేసినట్లు సమాచారం. నయనతార కంటే కియారానే ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. . నయన్ ఈ సినిమా కోసం 12 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిసింది. వీరిద్దరి తర్వాతే మిగిలిన హీరోయిన్లు ఉన్నారట.
హాట్ హాట్‌గా...
ఇందులో కియారా అద్వానీ రోల్ హాట్‌హాట్‌గా ఉంటుందని అంటున్నారు. యశ్ కియారా లవ్‌ట్రాక్, ఇంటిమేట్ సీన్లు, కెమిస్ట్రీ లో రొమాంటిక్ డోస్ పాళ్లు కాస్త ఎక్కువగానే ఉంటాయని టాక్ వినిపిస్తోంది.
యశ్ కథ...
టాక్సిక్ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌తో కలిసి ఈ సినిమాకు యశ్ కథను అందించారు. టాక్సిక్‌కు రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కేజీఎఫ్ 2 బ్లాక్‌బస్టర్ తర్వాత దాదాపు మూడేళ్ల అనంతరం యశ్ చేసిన సినిమా ఇది.
మరోవైపు తెలుగులో గేమ్ ఛేంజర్ తర్వాత కియారా మరో ఛాన్స్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌గా ఈ బాలీవుడ్ బ్యూటీ పేరు వినిపిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి






