Uttam Kumar Reddy | మరమ్మతులు అయ్యాకే.. వినియోగంలోకి కాళేశ్వరం బరాజ్‌లు : మంత్రి ఉత్తమ్
Uttam Kumar Reddy | మరమ్మతు పనులు పూర్తయ్యాకే కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లను వినియోగంలోకి తీసుకువస్తామని రాష్ట్ర నీటిపారులదశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ విజయవిహార్‌లో నీటిపారుదల శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు.
Uttam Kumar Reddy | మరమ్మతు పనులు పూర్తయ్యాకే కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లను వినియోగంలోకి తీసుకువస్తామని రాష్ట్ర నీటిపారులదశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ విజయవిహార్‌లో నీటిపారుదల శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై స్పందించారు. ఎన్‌డీఎస్ఏ, సీడబ్ల్యూసీ అనుమతి తర్వాతే బరాజ్‌లలో నీటి నిల్వ చేస్తామని తెలిపారు. ప్రజల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి రాజీలేదని తేల్చి చెప్పారు. రాజకీయాల కంటే ప్రజల భద్రతకే ప్రభుత్వ ప్రాధాన్యమన్నారు. రూ.1.10 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యతని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. మరమ్మతులు పూర్తికాకముందే బ్యారేజీల నిర్వహణ ప్రమాదకరమని హెచ్చరించారు. భద్రాచలం సహా దిగువ ప్రాంతాల్లోని 40 గ్రామాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులు శాస్త్రీయ విధానంలో కొనసాగుతున్నాయని మంత్రి చెప్పారు. డీఎన్ఎస్ఏ సూచనల మేరకు అన్ని గేట్లు ఎత్తి ఉంచినట్లు తెలిపారు. సీడబ్ల్యూసీ, సీడబ్ల్యూపీఆర్ఎస్‌తో పాటు అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. భద్రతపై పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతే బ్యారేజీలను వినియోగంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. అవసరమైన మరమ్మతుల ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. లైనింగ్ అవసరమైన కాలువల పనులు తక్షణమే ప్రారంభించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ఓపెన్ కాలువలను దశలవారీగా కప్పివేయాలని ఆదేశించారు. సాగునీటి పనుల్లో నాణ్యతతో పాటు వేగానికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోనే పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మిర్యాలగూడలో ఆధునిక ఎగుమతి రైస్ మిల్లును మంత్రి ప్రారంభించారు. అలాగే గుల్లపోతులగండి, కేశవాపూర్, నెల్లికల్ ఎత్తిపోతల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల కోసం చేపడుతున్న పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి ఉత్తమ్ వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CS Review | స్పెషల్ కాంటింజెన్సీ పంట ప్రణాళికలు సిద్ధం చేయాలి.. కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
జులై 4, 2026

Travel Advisory | థాయ్‌లాండ్ వెళ్దామనుకుంటున్నారా..? మీ కోసమే ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ..!
జులై 4, 2026

Alluri Birth Anniversary | అన్యాయాన్ని ప్రశ్నించడమే అల్లూరికి నిజమైన నివాళి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జులై 4, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | భట్టి గారూ.. మిడ్జిల్ మండలాన్ని దత్తత తీసుకోండి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Taylor Swift | పెళ్లి కోసం 190 కోట్ల ఖర్చు - రిటర్న్ గిఫ్ట్‌గా డైమండ్స్ - గ్రాండ్‌గా పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ వెడ్డింగ్
- ●CS Review | స్పెషల్ కాంటింజెన్సీ పంట ప్రణాళికలు సిద్ధం చేయాలి.. కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ●CM Revanth Reddy | ఆయనకు ఉరిశిక్ష వేసినా తక్కువే : సీఎం రేవంత్ రెడ్డి
- ●Ponguleti | భవనాలన్నీ ఒకే డిజైన్‌లో ఉండాలే.. సోలార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలే
- ●CM Revanth Reddy | నా ప్రాణం ఇచ్చినా కూడా తక్కువే.. మిడ్జిల్ సభలో సీఎం రేవంత్

CM Revanth Reddy | భట్టి గారూ.. మిడ్జిల్ మండలాన్ని దత్తత తీసుకోండి : సీఎం రేవంత్ రెడ్డి

Taylor Swift | పెళ్లి కోసం 190 కోట్ల ఖర్చు - రిటర్న్ గిఫ్ట్‌గా డైమండ్స్ - గ్రాండ్‌గా పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ వెడ్డింగ్

CS Review | స్పెషల్ కాంటింజెన్సీ పంట ప్రణాళికలు సిద్ధం చేయాలి.. కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం

CM Revanth Reddy | ఆయనకు ఉరిశిక్ష వేసినా తక్కువే : సీఎం రేవంత్ రెడ్డి



