Abhishek Banerjeee | అభిషేక్ బెనర్జీ నివాసంలో ఆకస్మిక సోదాలు.. భారీగా మోహరించిన పోలీసులు
Abhishek Banerjeee | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే వరుస రాజీనామాలతో సతమతమవుతున్న విపక్ష తృణమూల్ కాంగ్రెస్ (TMC)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మేనల్లుడు (Mamata Banerjee), ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjeee) ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Abhishek Banerjeee | త్రినేత్ర.న్యూస్: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే వరుస రాజీనామాలతో సతమతమవుతున్న విపక్ష తృణమూల్ కాంగ్రెస్ (TMC)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మేనల్లుడు (Mamata Banerjee), ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjeee) ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున కేంద్ర బలగాలతో కాళీఘాట్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి ఈ దాడి నిర్వహించినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. కాగా, రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించిన నకిలీ సంతకం కేసులో బెనర్జీని సీఐడీ (CID) బెనర్జీని విచారించిన రెండు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
పశ్చిమ మేదినీపూర్‌లోని సల్బోని పోలీస్ స్టేషన్, కోల్‌కతా పోలీసులతో కూడిన బృందాలు శనివారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత బెనర్జీ నివాసానికి చేరుకున్నాయని స్థానికులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పోలీసులు తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారని టీఎంసీ ఆరోపించింది. విషయం తెలుసుకున్న అభిషేక్ బెనర్జీ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ ఆపరేషన్ నాలుగు గంటలకు పైగా కొనసాగింది.
ఈ సందర్భంగా అభిషేక్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు తాళం పగలగొట్టి ఇల్లంతా సోదా చేశారని ఆరోపించారు. అయితే ఈ ఆపరేషన్ ఏ కేసుకు సంబంధించి నిర్వహించారనే విషయం తనకు తెలియదన్నారు. అధికారులు చెప్పలేదని వెల్లడించారు.
దీదీపై కేసు..
మరోవైపు మమతా బెనర్జీపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఎన్నికల ప్రచార సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఈ కేసు నమోదయింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 9న కోల్‌కతాలోని ఎస్‌ప్లనేడ్ ప్రాంతంలో జరిగిన సభలో దీదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు మతాల మధ్య శత్రుత్వాన్ని పురిగొల్పేలా ప్రసంగించారంటూ ఆమెపై ఫిర్యాదు రావడంతో నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో జీరో-ఎఫ్ఐఆర్ నమోదయింది. అనంతరం ఈ కేసును ఎస్‌ప్లనేడ్ పరిధిలోని హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
సంబంధిత వార్తలు

TMC | సయోని ఘోష్, యూసుఫ్ పఠాన్.. ఎన్డీయేకి మద్దతిస్తూ సంతకాలు చేసిన టీఎంసీ ఎంపీలు వీళ్లే..!
జూన్ 12, 2026

TMC-Congress | కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..? క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్
జూన్ 11, 2026

Shatrughan Sinha | “కష్టకాలంలో దీదీని వదలను” – రెబల్ క్యాంప్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన శతృఘ్న సిన్హా
జూన్ 11, 2026
తాజావార్తలు
- ●Plane Crashes | అస్సాంలో కుప్పకూలిన ఐఏఎఫ్ జెట్.. పైలట్ మృతి..!
- ●Woman Pilot | మహిళా పైలట్‌కు వేధింపులు.. జిమ్ మేనేజర్‌పై కేసు..
- ●Insurance | గడువు దాటిందని ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను తిరస్కరిస్తే కుదరదు
- ●Gold And Silver Prices Today | బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. ఇదే సరైన సమయమా..?
- ●Malayalam OTT | ఓటీటీలోకి మోహన్‌లాల్ మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ - తెలుగులో రిలీజ్
- ●Smrithi Irani | కేంద్ర మాజీ మంత్రికి షాక్.. ఓటర్ల జాబితాలో పేరు గల్లంతు..

Plane Crashes | అస్సాంలో కుప్పకూలిన ఐఏఎఫ్ జెట్.. పైలట్ మృతి..!

Woman Pilot | మహిళా పైలట్‌కు వేధింపులు.. జిమ్ మేనేజర్‌పై కేసు..

Insurance | గడువు దాటిందని ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను తిరస్కరిస్తే కుదరదు

Gold And Silver Prices Today | బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. ఇదే సరైన సమయమా..?



