త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallu Ravi | కేటీఆర్‌పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి ఎవిడెన్స్ సేకరించండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర పదజాలం వాడటంపై ఎంపీ మల్లు రవి హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు.

J

Hyderabad | Published On Sep 9, 2026, 3.36 pm IST

Mallu Ravi | కేటీఆర్‌పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి ఎవిడెన్స్ సేకరించండి

సంక్షిప్త సారాంశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను ఉద్దేశించి కేటీఆర్ అత్యంత అభ్యంతరకర పదజాలం వాడారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఒక కంప్లైంట్ అందజేశారు. బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ చట్టాల కింద పరువు నష్టం దావా, ఉద్దేశపూర్వక దూషణ సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకోవాలని మల్లు రవి పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
  • సీఎం రేవంత్‌పై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు
  • హైదరాబాద్ సీపీకి ఎంపీ మల్లు రవి ఫిర్యాదు

Mallu Ravi | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో (Telangana politics) మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వాడిన భాషపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎంను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో దూషించిన కేటీఆర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆయన బుధవారం ఒక అధికారిక ఫిర్యాదు (Complaint) అందజేశారు.

MP Mallu Ravi Files Police Complaint Against KTR Over Remarks on CM Revanth

ముఖ్యమంత్రి ప్రతిష్టను దిగజార్చేలా పర్సనల్ ఎటాక్

హైదరాబాద్ సీపీకి ఇచ్చిన తన కంప్లైంట్‌లో మల్లు రవి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ అత్యంత జుగుప్సాకరంగా దూషించారని మల్లు రవి పేర్కొన్నారు. "సీఎం రేవంత్ రెడ్డి చిల్లర..." అంటూ కేటీఆర్ వాడిన పదజాలం రాజ్యాంగబద్ధమైన పదవికి అవమానకరమని, ఇది కేవలం ప్రభుత్వ విధానాలపై చేసిన విమర్శ కాదని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి గౌరవాన్ని, ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా ఒక అసెంబ్లీ సభ్యుడే ఇలాంటి పర్సనల్ అటాక్‌కు దిగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు.

MP Mallu Ravi Files Police Complaint Against KTR Over Remarks on CM Revanth

సీఎంను కించపరిచేలా మాట్లాడిన కేటీఆర్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS 2023) చట్టం కింద తక్షణమే లీగల్ యాక్షన్ (Legal action) తీసుకోవాలని మల్లు రవి డిమాండ్ చేశారు. పరువు నష్టం కలిగించినందుకు సెక్షన్ 356, ఉద్దేశపూర్వకంగా దూషించినందుకు సెక్షన్ 352 కింద క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని కోరారు.

MP Mallu Ravi Files Police Complaint Against KTR Over Remarks on CM Revanth

అలాగే, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) లోని ప్రొసీజర్ల ప్రకారం, ముఖ్యంగా సెక్షన్ 222 కింద తగిన విచారణ జరపాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు టెలివిజన్, న్యూస్ పేపర్లు, డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్లాయని.. కాబట్టి దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను (Electronic evidence) వెంటనే సేకరించి భద్రపరచాలని కోరారు. ఎంపీ మల్లు రవి ఫిర్యాదుతో ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement
Advertisement