త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | రెండేళ్ల త‌ర్వాత ఇంకా మీరుంటరా ఏంది.. అప్పుడు మేమొస్తం

Ramchandar Rao | మూడేండ్ల‌లో టీచ‌ర్ల‌కు ఏం చేయకుండా ఇంకో రెండేండ్లు టైం ఇవ్వాల‌ని సీఎం రేవంత్ అడగ‌డం ఆయ‌న చేత‌గానిత‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు విమ‌ర్శించారు. రెండేళ్ల త‌ర్వాత తామే అధికారంలోకి వ‌స్తామ‌ని చెప్పారు.

S

Telangana | Published On Sep 6, 2026, 1.58 pm IST

Ramchandar Rao | రెండేళ్ల త‌ర్వాత ఇంకా మీరుంటరా ఏంది.. అప్పుడు మేమొస్తం
Advertisement
  • వ‌చ్చాక విద్యా వ్య‌వ‌స్థ‌ను బాగు చేస్తం
  • బ‌డ్జెట్ పెంచి, టీచింగ్ ఖాళీల‌న్నీ నింపుతాం
  • స‌ర్ ప్రక్రియ‌లో బీఎల్‌వోలు వారి క‌ర్త‌వ్యాన్ని మ‌ర‌వొద్దు
  • బీజేపీ ఓట్లు తొల‌గించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌రు
  • బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: మూడేండ్ల‌లో టీచ‌ర్ల‌కు ఏం చేయకుండా ఇంకో రెండేండ్లు టైం ఇవ్వాల‌ని సీఎం రేవంత్ అడగ‌డం ఆయ‌న చేత‌గానిత‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు విమ‌ర్శించారు. రెండేళ్ల త‌ర్వాత తామే అధికారంలోకి వ‌స్తామ‌ని చెప్పారు. విద్యా వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా బాగు చేస్తామ‌న్నారు. స‌ర్ ప్ర‌క్రియ వ‌ల్ల బీజేపీ అధికారంలోకి వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని రేవంత్ మాట్లాడ‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. స‌ర్ ప్ర‌క్రియ త‌ర్వాతే కేర‌ళ‌లో ఎన్నిక‌లు వస్తే అక్క‌డ వాళ్ల పార్టీయే గెలిచింద‌ని గుర్తు చేశారు. ఈమేర‌కు హైద‌రాబాద్ నాంప‌ల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు.

స‌ర్ వ‌ల్ల బీజేపీ అధికారంలోకి వ‌చ్చే ప్ర‌యత్నం చేస్తోందని నిన్న ముఖ్య‌మంత్రి రేవంత్ అన్నారు. స‌ర్ ప్ర‌క్రియ త‌ర్వాతే కేర‌ళ‌లో ఎన్నిక‌లు జ‌రిగిన‌య్‌. మ‌రి అక్క‌డ గెలిచింది వాళ్ల పార్టీయే క‌దా. మ‌రి స‌ర్‌ను ఏవిధంగా అంటారు. రేపు ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా బీజేపీ గెలుస్తుంది కాబ‌ట్టి, మొన్న వ‌చ్చిన స‌ర్వేల్లో బీజేపీకి ఉన్న‌దాని కంటే ఎక్కువ సీట్లు వ‌స్తున్న‌య్ కాబ‌ట్టి ఈరోజు మీరు ఈ మాట‌లు మాట్లాడుతున్నారు.

తొమ్మిదిన్న‌ర ల‌క్ష‌ల ఓట్లు త‌గ్గిన‌య్‌..

బీఎల్‌వోల ఆధ్వ‌ర్యంలో స‌ర్ ప్ర‌క్రియ జ‌రుగుతుంది. వాళ్లు మీ ఎంప్లాయిస్‌యే క‌దా. బీజేపీ ఓట‌ర్లను తీయించే ప్ర‌యత్నం చేశారు. ఓల్డ్ సిటీలో ఓట్లు త‌గ్గ‌లే. కానీ న్యూ సిటీలో ఎందుకు త‌గ్గిన‌య్‌. సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో తొమ్మిదిన్న‌ర ల‌క్ష‌ల ఓట్లు త‌గ్గిన‌య్‌. మ‌జ్లిస్ పార్టీ ఓట్లు మాత్రం ఇంపాక్ట్‌. ప్ర‌జ‌ల్లో త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డానికి, బీజేపీ ఓట్ల‌ను త‌గ్గించడానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారు బీజేపీకి ఓటు వేసే అవ‌కాశాలుంటాయి. ఆ ఓట్ల‌ను కావాల‌ని తీయించే కుట్ర చేశారు.

బీఎల్‌వోలు ప్ర‌భుత్వం మాట విని మీ క‌ర్త‌వ్యాన్ని మ‌రిచిపోవ‌ద్దు. ఖ‌మ్మంలో ఇట్ల‌నే జ‌రిగింది. బీజేపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే విచార‌ణ‌లో బ‌య‌ట‌ప‌డితే వారికి శిక్ష ప‌డ్డ‌ది. స‌ర్ ప్ర‌క్రియ‌ను వాళ్ల చేతుల్లో పెట్టుకొని బీజేపీని బ‌ద్నాం చేస్తున్నారు. సికింద్రాబాద్‌లో మా వీరేంద‌ర్‌గౌడ్ కుటుంబానికి ఓటు న‌మోదు చేసేందుకే నోటీసులు ఇస్తున్నారు. వాళ్ల పేర్లు తీసేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌రు. బీజేపీపై అబండాలు వేసే బ‌దులు మీ వాళ్ల ప‌నితీరు గురించి చెప్తే బాగుంట‌ది.

నిన్న టీచ‌ర్ల‌కు ఇంకో రెండేళ్లు టైం ఇవ్వండి అని అడుగుతున్న‌రు. ఆల్రెడి మూడేండ్లు అయిపోయినయ్‌. రిటైర్డ్ టీచ‌ర్ల‌కు పెన్ష‌న్లు రాక‌.. ఉన్న టీచ‌ర్ల‌కు స‌రైన స‌మయానికి జీతాలు రాక, ప్ర‌మోష‌న్లు లేక ఇబ్బంది ప‌డుతున్నారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇవ్వ‌ట్లేద‌ని చెప్పి టీచ‌ర్ల‌కు స‌గం సాల‌రీలు ఇస్తున్న‌రు. విద్యా వ్య‌వ‌స్థ‌ను బాగు చేయండి.

9 శాతం మాత్ర‌మే విద్య‌కు బ‌డ్జెట్ కేటాయించారు. మీతోని కాక‌పోతే ఎడ్యుకేష‌న్ మినిస్ట‌ర్ ప‌ద‌వి వేరేవాళ్ల‌కు ఇవ్వండి. ఉస్మానియాలో హాస్ట‌ళ్ల ప‌రిస్థితిని వెళ్లి చూడండి. వెయ్యి కోట్లు ఇస్తా అని వెయ్యి రూపాయ‌లు కూడా ఇయ్య‌లే. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వ‌చ్చి ధ‌ర్నా చేశారు. బీజేపీ స్టూడెంట్స్‌తోని ఉంది. మీరు దేనికీ ఇబ్బంది ప‌డొద్దు. ఎంత‌దాకైనా కొట్లాడుదాం. వాళ్ల‌ను చ‌ద‌వ‌కుండా చేస్తున్న‌రు.

ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.. ఎన్ని పెట్టుబ‌డులు వ‌చ్చిన‌య్‌.. మీరు దావోస్‌కు ఎన్నిసార్లు పోయారు వైట్ పేప‌ర్ పెట్టండి. అది లేదు. మూడు డీఏలు రావాలంట‌. రైతులు, ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, విద్యార్థులు ఇలా అంతా స్ట్రైక్‌లో ఉన్న‌రు. మీ ప‌రిపాల‌న‌లో అంతా రోడ్ల మీదికి వ‌స్తున్న‌రు. విద్యా వ్య‌వ‌స్థ‌ను బాగు చేయండి. దేశానికి ప‌నికొచ్చే పౌరుల‌ను మీరు స‌రిగా చూడండి. గురువుల‌కే మీరు అబ‌ద్దాలు చెప్తున్న‌రు.

ఇంకా రెండేళ్లు అంటున్న‌రు. రెండేళ్ల త‌ర్వాత ఇంకా మీరుంట‌ర‌ని అనుకుంటున్న‌రా ఏంది.. మేమొస్తం అప్పుడు. మేం వ‌చ్చినంక విద్యా వ్య‌వ‌స్థ‌ను బాగు చేస్తం. బ‌డ్జెట్ పెంచుతం. టీచింగ్ ఫీల్డ్‌లో అన్ని ఖాళీల‌ను నింపుతాం. రీసెర్చ్‌కు ప్రాధాన్యం ఇస్తాం రాంచంద‌ర్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement