Bandi Sanjay | ఆ ముగ్గురు మంత్రులు వసూళ్లలో బిజీ..
Bandi Sanjay | ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు వసూళ్లలో బిజీ బిజీగా ఉన్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మా అధ్యక్షుడు రామచందర్ రావు చేయించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని, ఆ ముగ్గురు మంత్రుల పరిస్థితి ఘోరంగా ఉందని ఆయన తెలిపారు.
- బీజేపీ సర్వేలో వెల్లడైందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
Bandi Sanjay | త్రినేత్ర.న్యూస్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు వసూళ్లలో బిజీ బిజీగా ఉన్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మా అధ్యక్షుడు రామచందర్ రావు చేయించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని, ఆ ముగ్గురు మంత్రుల పరిస్థితి ఘోరంగా ఉందని ఆయన తెలిపారు. భద్రాచలం శ్రీరాముల వారిని బండి సంజయ్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్న అనంతరం బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు.

భద్రాచలం సీతారాముల ఆలయం శక్తివంతమైన ఆలయం. ఈ టెంపుల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకే పరిమితం కాదు.. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. బతికున్నంత కాలం భద్రాచలం పోయి సీతారాములను దర్శనం చేసుకోవాలని ప్రతి హిందువులో ఉంటుంది. అయోధ్యలో రామమందిరం నిర్మించినం. మనందరం రాముని వారసులం. రామరాజ్యం తీసుకువచ్చాం. దేశంలో సుభిక్ష పాలన ఉంది.. దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తూ.. శత్రువుల నుంచి కాపాడుతున్నాం. శక్తివంతమైన భారతదేశాన్ని తయారు చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా.. నేను భారతీయుడిని అని గర్వంగా తలెత్తుకునే విధంగా మోదీ నాయకత్వంలో చేశాం.. చేస్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో బీజేపీ తక్కు వ అంటరు..
ఖమ్మం జిల్లాలో బీజేపీ తక్కు వ అంటరు.. కానీ ఖండిస్తున్నా. మనం పవర్‌ఫుల్. కానీ ఈ మీడియా ఉంది.. ఏం మాట్లాడరాదు.. ఇదో బాధ. కొంచెం కష్టపడాల్సి వస్తది. నిరుద్యోగ మార్చ్‌కు 10 వేలకు పైగా, అమిత్ షా మీటింగ్ పెడితే లక్షకు పైగా వచ్చారు. ఉమ్మడి ఖమ్మంలో బలమైన కేడర్ ఉంది. ఎన్నికలు వేరు, పార్టీ సంస్థాగత కార్యక్రమాలు వేరు.. పార్టీ పరంగా మనం పవర్‌ఫుల్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలవాలనే లక్ష్యంతో ముందుకు పోదాం. అత్యధిక నిధులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇచ్చినం. ప్రసాదం స్కీమ్ కింద భద్రాద్రి టెంపుల్‌కు రూ. 41 కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి తెలిపారు.
ముగ్గురు ఆషామాషీ మంత్రులు కూడా కాదు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఇక్కడ ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు. పాపం వాళ్ల గురించి వాళ్లు చూసుకునేందుకు బీజీగా ఉన్నారు. సంపుడే సంపుడే .. ప్రజల గురించి ఆలోచించడం లేదు. రామచందర్ రావు సర్వే చేస్తే ఈ ముగ్గురు మంత్రుల పరిస్థితి ఘోరంగా ఉంది. మంత్రుల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. మొత్తం సంపుడే అని వచ్చింది. ముగ్గురు ఆషామాషీ మంత్రులు కూడా కాదు.. ఒకరు సీఎంకు రైట్ హ్యాండ్, మరొకరు లెఫ్ట్ హ్యాండ్.. ఇంకొకరు అవకాశం వస్తే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోనేందుకు రెడీగా ఉన్నారు. ఖమ్మం జిల్లాకు ఒక్క పైసా తీసుకురారు కానీ ఢిల్లీకి మూటలు మోస్తున్నారు. గతంలో ఢిల్లీకి సీఎం పైసలు పంపిస్తుండే. కానీ ఈ జిల్లా మంత్రి ఒకరు కేరళ ఎన్నికలప్పుడు కేసీ వేణుగోపాల్‌కు పైసలు ఇచ్చిండట. నాకు తెలియకుండా ఇస్తావా అని సీఎం ఒత్తిండట. ఇక ఆ మంత్రి పవర్ కొంచెం తగ్గుతుందట అని బండి సంజయ్ పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Veerapalli Shankar | కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు: కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్‌పై పోలీసులకు ఫిర్యాదు
- ●Nivetha Thomas | ’శ్రీమతి’గా నివేదా థామస్.. ఫస్ట్‌లుక్ అదిరిపోయింది!
- ●NSE IPO | ఈ నెలలోనే ఎన్ఎస్ఈ ఐపీవో..? భారీ ఆఫర్..
- ●Ramachander Rao | రాజకీయ నాటకాలకు వేదికగా అసెంబ్లీ : రామచందర్ రావు
- ●Bhatti Vikramarka - Sridhar Babu | కేసీఆర్ నిండు నూరేళ్లు బతకాలి.. ఆయన చావు మేమెందుకు కోరుకుంటాం?
- ●PM Modi | మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితం.. బీజేపీ కీలక ప్రకటన

Veerapalli Shankar | కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు: కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్‌పై పోలీసులకు ఫిర్యాదు

Nivetha Thomas | ’శ్రీమతి’గా నివేదా థామస్.. ఫస్ట్‌లుక్ అదిరిపోయింది!

NSE IPO | ఈ నెలలోనే ఎన్ఎస్ఈ ఐపీవో..? భారీ ఆఫర్..

Ramachander Rao | రాజకీయ నాటకాలకు వేదికగా అసెంబ్లీ : రామచందర్ రావు




