త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kollywood | క‌త్తితో కేక్ క‌ట్ – స్టార్ డైరెక్ట‌ర్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌పై వివాదం

త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ వివాదంలో చిక్కుకున్నాడు. త‌న బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌లో అభిమానులు బ‌హూక‌రించిన పెద్ద క‌త్తితో వెట్రిమార‌న్ కేక్ క‌ట్ చేయ‌డంపై నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. వెట్రిమార‌న్‌పై కేసు పెట్టాలంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

N

Entertainment | Published On Sep 5, 2026, 10.27 am IST

Kollywood | క‌త్తితో కేక్ క‌ట్ –  స్టార్ డైరెక్ట‌ర్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌పై  వివాదం
Advertisement

Kollywood |  త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ చిక్కుల్లో ప‌డ్డాడు. ఈ డైరెక్ట‌ర్‌ను అరెస్ట్ చేయాలంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. కోలీవుడ్‌లో వివాద‌ర‌హితుడిగా వెట్రిమార‌న్‌కు పేరుంది. సినిమాలు త‌ప్ప ఇత‌ర విష‌యాల్లో పెద్ద‌గా జోక్యం చేసుకోడు. అలాంటి ద‌ర్శ‌కుడిపై కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ కావ‌డం త‌మిళ సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ వివాదానికి అత‌డి బ‌ర్త్‌డ్ సెల‌బ్రేష‌న్స్ కార‌ణ‌మ‌య్యాయి.

క‌త్తితో కేక్ క‌ట్‌

శుక్ర‌వారం వెట్రిమార‌న్ 51 ఏళ్ల‌లోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా అభిమానులు ఘ‌నంగా వెట్రిమార‌న్ పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో ఫ్యాన్స్ బ‌హూక‌రించిన పెద్ద క‌త్తితో వెట్రిమార‌న్ సంబ‌రాలు చేశారు. ఆ క‌త్తితోనే కేక్ క‌ట్ చేశారు.

ఇదేనా మెసేజ్‌....

దీనిపై నెటిజ‌న్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. క‌త్తితో కేక్ క‌ట్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని అంటున్నారు. సొసైటీలోని మంచిచెడుల‌ను ఆవిష్క‌రిస్తూ మెసేజ్ ఓరియెంటెడ్‌ సినిమాలు తీసే వెట్రిమార‌న్‌...క‌త్తితో కేక్ క‌ట్ చేస్తూ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సందేశం ఇవ్వాల‌ని అనుకుంటున్నాడ‌ని ట్రోల్ చేస్తున్నారు. సోష‌ల్ రెస్సాన్సిబిలిటీ అంటే ఇదేనా అని కామెంట్లు పెడుతున్నారు.

అరెస్ట్ చేస్తారా?

గ‌తంలో క‌త్తుల‌తో కేక్ క‌ట్ చేసినందుకు కొంద‌రు రౌడీల‌ను త‌మిళ‌నాడు పోలీస్‌లు అరెస్ట్ చేశారు. వెట్రిమార‌న్‌ను కూడా ఇలాగే అరెస్ట్ చేస్తారా? అంటూ త‌మిళ‌నాడు పోలీసుల‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.

విజ‌య్ సేతుప‌తి

గ‌తంలో విజ‌య్ సేతుప‌తి ఇలాగే క‌త్తితో కేక్ క‌ట్ చేశాడు. విమ‌ర్శ‌లు రావ‌డంతో క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ఇప్పుడు అదే త‌ర‌హాలో వెట్రిమార‌న్ వివాదంలో చిక్కుకోవ‌డం త‌మిళ‌నాట ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్ర‌స్తుతం అర‌స‌న్ సినిమాకు వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో శింబు హీరోగా న‌టిస్తోన్నాడు.

Advertisement
Advertisement