Medical Emergency | దోహా నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానం.. మస్కట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Medical Emergency | ఖతార్ రాజధాని దోహా నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానాన్ని (IndiGo Flight) మెడికల్ ఎమర్జెన్సీ (Medical Emergency) కారణంగా ఒమన్ రాజధాని మస్కట్‌కు దారిమళ్లించారు.
Medical Emergency | త్రినేత్ర.న్యూస్: ఖతార్ రాజధాని దోహా నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానాన్ని (IndiGo Flight) మెడికల్ ఎమర్జెన్సీ (Medical Emergency) కారణంగా ఒమన్ రాజధాని మస్కట్‌కు దారిమళ్లించారు. ఇండిగోకి చెందిన 6E 1302 విమానం దోహా (Doha) నుంచి బెంగళూరు (Bengaluru) బయల్దేరింది. అయితే విమాన సిబ్బందిలో ఒకరికి అత్యవసర వైద్య సహాయం అవసరం కావడంతో దానిని మస్కట్‌కు (Muscat) దారిమళ్లించినట్లు (Diverted) విమానయాన సంస్థ వెల్లడించింది.
విమానం మస్కట్‌లో దిగిన వెంటనే సదరు సిబ్బందికి (Crew Member) వైద్య బృందం చికిత్స అందించామని పేర్కొంది. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారని తెలిపింది. అయితే ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి వీలుగా ప్రత్యామ్నాయ విమానంతో పాటు కొత్త సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో మస్కట్‌లో వేచి ఉన్న ప్రయాణికులకు అవసరమైన అల్పాహారంతో పాటు, విమాన సమయాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. విమాన దారిమళ్లింపు వల్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. `మా వినియోగదారులు, సిబ్బంది, విమానం భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం` అని ఇండిగో స్పష్టం చేసింది.
అయితే, మస్కట్‌లో దిగిన విమానం (ఇండిగో 6E 1302) బెంగళూరుకు ఎప్పుడు చేరుకుంటుందనే విషయాన్ని ఎయిర్‌లైన్స్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి






