త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IAS Vikas Marmat | ప‌బ్‌లో ఏపీ ఐఏఎస్ వీరంగం.. బెంగ‌ళూరులో క్రిమిన‌ల్ కేసు న‌మోదు

IAS Vikas Marmat | క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు( Bengaluru )లోని రెసిడెన్సీ రోడ్డులోని ఓ ప‌బ్‌( Pub )లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వికాస్ మ‌ర్మ‌త్( IAS Vikas Marmat ) వీరంగం సృష్టించారు. పోలీసుల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండా, వారిపై చేయి చేసుకోబోయిన ఐఏఎస్‌పై క్రిమిన‌ల్ కేసు( Criminal Case ) న‌మోదైంది.

S

National | Published On Oct 13, 2026, 1.40 pm IST

IAS Vikas Marmat | ప‌బ్‌లో ఏపీ ఐఏఎస్ వీరంగం.. బెంగ‌ళూరులో క్రిమిన‌ల్ కేసు న‌మోదు
Advertisement

IAS Vikas Marmat | త్రినేత్ర న్యూస్ : క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు( Bengaluru )లోని రెసిడెన్సీ రోడ్డులోని ఓ ప‌బ్‌( Pub )లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వికాస్ మ‌ర్మ‌త్( IAS Vikas Marmat ) వీరంగం సృష్టించారు. పోలీసుల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండా, వారిపై చేయి చేసుకోబోయిన ఐఏఎస్‌పై క్రిమిన‌ల్ కేసు( Criminal Case ) న‌మోదైంది. వికాస్ మ‌ర్మ‌త్ చిత్తూరు జిల్లా కుప్పం ఏరియా డెవ‌ల‌ప్‌మెంట్ అధారిటీ ప్రాజెక్టు() డైరెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.

అస‌లేం జ‌రిగిందంటే..?

బెంగ‌ళూరు రెసిడెన్సీ రోడ్డులోని కావోర్ బార్ అండ్ రెస్టారెంట్ ప‌బ్‌లో అక్టోబ‌ర్ 9వ తేదీ అర్ధ‌రాత్రి బెంగ‌ళూరు సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ త‌నిఖీల స‌మ‌యంలో వికాస్ మ‌ర్మ‌త్ త‌న స్నేహితుల‌తో క‌లిసి అక్క‌డే ఉన్నారు. అప్ప‌టికే పీక‌ల దాకా మ‌ద్యం సేవించి ఉన్న స‌ద‌రు ఐఏఎస్.. త‌నిఖీలు చేస్తున్న పోలీసుల‌పై దూసుకెళ్లారు. అస‌భ్య ప‌ద‌జాలంతో దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. దీంతో బెంగ‌ళూరు పోలీసులు వికాస్‌తో పాటు అభ‌య్ ఉద‌య్ సింగ్, నితీష్, రోష‌న్ అనే వ్య‌క్తుల‌పై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేశారు. కబ్బన్ పార్క్ పీఎస్‌లో క్రైమ్ నంబర్ 150/2026 కింద ఈ క్రిమినల్ కేసు నమోదు చేసి,దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement
Advertisement