త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abhishek Banerjee Attack | హెల్మెట్ ప్రాణం కాపాడింది.. లేదంటే చనిపోయేవాడు: అభిషేక్ బెనర్జీపై దాడి ఘటనలో మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

బెంగాల్‌లో పోస్ట్-పోల్ హింస భగ్గుమంది. సోనార్‌పూర్‌లో అభిషేక్ బెనర్జీపై రాళ్లు, గుడ్లతో దాడి జరగ్గా, హాస్పిటల్స్ ట్రీట్‌మెంట్ చేయకుండా బీజేపీ ఆపుతోందని మమత ఫైర్ అయ్యారు.

J

National | Published On May 31, 2026, 3.11 pm IST

Abhishek Banerjee Attack | హెల్మెట్ ప్రాణం కాపాడింది.. లేదంటే చనిపోయేవాడు: అభిషేక్ బెనర్జీపై దాడి ఘటనలో మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
Advertisement

Abhishek Banerjee Attack | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పోస్ట్-పోల్ హింసకు గురైన పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు సౌత్ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్ వెళ్లిన టీఎంసీ నేత, మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై శనివారం సాయంత్రం స్థానికులు తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడ్డారు. జనం ఆయనపై గుడ్లు, రాళ్లు విసురుతూ 'దొంగ.. దొంగ' అంటూ నినాదాలు చేశారు. ఈ భయానక పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు ఆయన వైట్ షర్ట్ మీద ఓ క్రికెట్ హెల్మెట్ పెట్టుకుని, భారీ పబ్లిక్ మధ్య నుంచి అతికష్టం మీద బయటపడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హెల్మెట్ లేకపోతే ప్రాణాలు పోయేవి: మమత

"సరిగ్గా ఆ క్రూషియల్ టైమ్‌లో ఆయన తలపై హెల్మెట్ పెట్టి ఉండకపోతే, పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నా మేనల్లుడు ప్రాణాలు కోల్పోయేవాడు" అని మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. రాళ్ల దాడి, ఫిజికల్ ఎటాక్ వల్ల అభిషేక్ ఛాతీ, పక్కటెముకల భాగంలో తీవ్ర గాయాలయ్యాయని, 'బ్లడ్ క్లాట్స్' (Blood clots) కూడా ఏర్పడ్డాయని ఆమె ఆరోపించారు. మెడ, వీపు, నడుము నొప్పితో ఆయన తీవ్రంగా బాధపడుతున్నట్లు తెలిపారు.

Abhishek Banerjee Attacked in Sonarpur Mamata Alleges BJP

హాస్పిటల్స్‌పై పాలిటిక్స్.. సీఈవోకి మమత వార్నింగ్

ఈ ఘటన తర్వాత ట్రీట్‌మెంట్ విషయంలో ఆసుపత్రుల తీరుపై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం కోసం మొదట ఈఎం బైపాస్ దగ్గర ఉన్న అపోలో హాస్పిటల్‌కు, ఆ తర్వాత బెల్లె వ్యూ (Belle Vue) హాస్పిటల్‌కు అభిషేక్‌ను తరలించారు. అయితే, హాస్పిటల్ యాజమాన్యాలపై పైనుంచి (బీజేపీ నేతలు, పోలీసుల నుంచి) తీవ్ర ఒత్తిడి ఉందని, అందుకే ఉద్దేశపూర్వకంగానే ట్రీట్‌మెంట్ లేట్ చేశారని మమత ఆరోపించారు.

బెల్లె వ్యూ హాస్పిటల్ సీఈవో ప్రదీప్ టాండన్‌పై మమత తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్న ఒక వీడియో లీక్ అయింది. "సారీ మిస్టర్ టాండన్, మీరు తప్పు చేస్తున్నారు. మీకు మేము చేసిన సాయం గుర్తుంచుకోండి. మీరు చేస్తున్న దానికి దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. సెంట్రల్ గవర్నమెంట్ అండ చూసుకుని ఇలా చేస్తున్నారేమో.. రేపు వాళ్లు లేనప్పుడు సంగతి మేము చూసుకుంటాం" అంటూ ఆమె వార్నింగ్ ఇవ్వడం ఆ వీడియోలో రికార్డ్ అయింది. ప్రస్తుతం అభిషేక్‌కు ఆయన ఇంట్లోనే ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు మమత స్పష్టం చేశారు.

ఇది వాళ్ల కర్మ: బీజేపీ కౌంటర్

రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీనే ఈ దాడిని స్పాన్సర్ చేస్తోందని, తనను చంపడానికే పొలిటికల్ రైవల్స్ ఈ ప్లాన్ చేశారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. పోలీసులకు ముందే సమాచారం ఉన్నా భద్రత కల్పించలేదని విమర్శించారు. కాగా, ఈ దాడి ఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు.

మరోవైపు టీఎంసీ ఆరోపణలపై బీజేపీ లీడర్ కేయా ఘోష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అభిషేక్ పై దాడి అనేది టీఎంసీ నేతలకు పట్టిన 'కర్మ' అని ఆమె వ్యాఖ్యానించారు. "గత 15 ఏళ్లలో బెంగాల్ ప్రజలు టీఎంసీ ప్రభుత్వ హయాంలో ఎన్నో అకృత్యాలు చూశారు. ఇప్పుడు వారికి అదే రిటర్న్ గిఫ్ట్‌గా అందుతోంది. కర్మ అంటే ఏంటో తెలుసా? మీరు ఏమి చేశారో అదే మీకు తిరిగి వస్తుంది" అని ఆమె చురకలంటించారు.

Advertisement
Advertisement