త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ravidi Venkat Reddy | కవిత చుట్టూ ఉన్నవాళ్లే ‘BRS’ కోవర్టులు: ఐన్యూస్ ఇంటర్వ్యూలో రావిడి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రక్షణ సేన (TRS)కు రాజీనామా చేసిన మాజీ నేత రావిడి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత చుట్టూ ఉన్నదే బీఆర్ఎస్ కోవర్టులని ఐన్యూస్‌తో బాంబు పేల్చారు.

J

Telangana | Published On Jun 1, 2026, 10.00 pm IST

Ravidi Venkat Reddy | కవిత చుట్టూ ఉన్నవాళ్లే ‘BRS’ కోవర్టులు: ఐన్యూస్ ఇంటర్వ్యూలో రావిడి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement

Ravidi Venkat Reddy | త్రినేత్ర.న్యూస్ : ఐన్యూస్ (INews) ఛానెల్‌తో జరిగిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మాజీ అధ్యక్షుడు రావిడి వెంకట్ రెడ్డి పొలిటికల్ బాంబు పేల్చారు. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. అందుకు గల కారణాలను వివరిస్తూ నాయకత్వంపై, కవిత చుట్టూ ఉన్న వ్యక్తులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీలో క్రమశిక్షణ లోపించిందని, ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేసేవారికే అక్కడ ప్రాధాన్యత దక్కుతోందని ఆయన కుండబద్దలు కొట్టారు.

దందాలు, భూకబ్జాలకే ప్రయారిటీనా?

పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన సీనియర్లను, నిజమైన కార్యకర్తలను పక్కనపెట్టారని వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. "కేవలం భూకబ్జాలు, దందాలు, వసూళ్లకు పాల్పడే వారికే ఇప్పుడు పార్టీలో పెద్దపీట వేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి క్రమశిక్షణా లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితులు నచ్చకే, కొన్ని అనివార్య కారణాల వల్ల నేను తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది" అని ఆయన స్పష్టం చేశారు.

కవిత మళ్లీ బీఆర్ఎస్ (BRS) గూటికే.. కోవర్టుల వల్లే నష్టం

ఈ సందర్భంగా కవిత రాజకీయ భవిష్యత్‌పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ (BRS) పార్టీలోకే చేరుతారని ఆయన జోస్యం చెప్పారు. "ఆమె చుట్టూ ఉన్నవాళ్లే పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు. వాస్తవానికి వారంతా బీఆర్ఎస్ కోవర్టులే (Coverts). ఈ విషయాన్ని ఇప్పటికైనా కవిత గ్రహించి, తగిన సర్దుబాట్లు చేసుకోకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.. భవిష్యత్తులో పార్టీ పూర్తిగా కనుమరుగవ్వడం ఖాయం" అని వెంకట్ రెడ్డి హెచ్చరించారు.

క్యూ కడుతున్న రాజీనామాలు

తన రాజీనామా కేవలం ఆరంభం మాత్రమేనని, త్వరలో పార్టీ నుంచి భారీ స్థాయిలో వలసలు ఉంటాయని ఆయన హింట్ ఇచ్చారు. "నాతో పాటు చాలామంది నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేన పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే వాళ్లందరూ ఆ పార్టీ నుంచి బయటకు వస్తారు" అని ఆయన తేల్చిచెప్పారు. అసంతృప్తితో రగిలిపోతున్న కేడర్ అంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement
Advertisement