త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ashok Dinda | సువేందు కేబినెట్‌లోకి టీమిండియా మాజీ ఫాస్ట్ బౌల‌ర్‌..!

Ashok Dinda | టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో చోటు దక్కించుకున్నారు. సోమవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో దిండా మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి దిండాతో పాటు కొత్త మంత్రులంద‌రితో ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు.

P

Sports | Published On Jun 1, 2026, 3.30 pm IST

Ashok Dinda | సువేందు కేబినెట్‌లోకి టీమిండియా మాజీ ఫాస్ట్ బౌల‌ర్‌..!

అశోక్ దిండా

Advertisement

Ashok Dinda | టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో చోటు దక్కించుకున్నారు. సోమవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో దిండా మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి దిండాతో పాటు కొత్త మంత్రులంద‌రితో ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. మొయ్నా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున వరుసగా రెండోసారి విజయం సాధించిన దిండాకు మంత్రివర్గంలో అవకాశం లభించింది. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ఆయన బీజేపీలో చేరారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సంగ్రామ్ కుమార్ దోలాయ్‌పై 1,260 ఓట్ల తేడాతో గెలుపొందారు. తాజా జ‌రిగిన ఎన్నికల్లో దిండా మ‌రోసారి భారీ విజ‌యం సాధించారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చందన్ మండల్‌పై 16,241 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి మొయ్నా నియోజకవర్గాన్ని వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ముఖ్యమంత్రి సురేందు అధికారి నేతృత్వంలోని ప్ర‌భుత్వం సోమ‌వారం మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్టింది. మొత్తం 35 మంది కొత్త మంత్రులను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అశోక్ దిండాకు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అశోక్ దిండా 2009లో భారత జట్టు తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. 2012లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ఆయన చివరి టీ20 ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్‌. 2010లో జింబాబ్వేపై వన్డేల్లో తొలి మ్యాచ్ ఆడిన దిండా.. 2013లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ త‌ర్వాత వ‌న్డే కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. భార‌త టెస్టు జ‌ట్టులో ఆడే అవ‌కాశం రాక‌పోయినా డొమెస్టిక్ క్రికెట్‌, ఐపీఎల్‌లో ప‌లు జ‌ట్ల త‌ర‌ఫున ఆడాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 13 వన్డేల్లో 12 వికెట్లు, టీ20 అంతర్జాతీయాల్లో 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 116 మ్యాచ్‌ల్లో 420 వికెట్లు పడగొట్టిన దిండా.. లిస్ట్-ఏ క్రికెట్‌లో 98 మ్యాచ్‌ల్లో 151 వికెట్లు తీశాడు.

Advertisement
Advertisement