Smrithi Irani | కేంద్ర మాజీ మంత్రికి షాక్.. ఓటర్ల జాబితాలో పేరు గల్లంతు..
Smrithi Irani | కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీకి (Smrithi Irani) వింత అనుభవం ఎదురయింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ (Amethi) జిల్లా మైదాన్ మైవా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో (Panchayat Voter List) ఆమె పేరు గల్లంతయ్యింది.
Smrithi Irani | త్రినేత్ర.న్యూస్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీకి (Smrithi Irani) వింత అనుభవం ఎదురయింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ (Amethi) జిల్లా మైదాన్ మైవా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో (Panchayat Voter List) ఆమె పేరు గల్లంతయ్యింది. ఈ విషయం సంచలనంగా మారడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. గతంలో ఆమె అమేథీ ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని (Rahul Gandhi) ఓడించిన స్మతి.. 2024 వరకు అమేథీ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.
అదే సమయంలో అమేథీ జిల్లా గౌరీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మేదాన్ మవాయి (Medan Mawai) ఆమె ఇంటిని నిర్మించుకున్నారు. అనంతరం ఆ గ్రామ ఓటరుగా నమోదుచేసుకున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఇదే ప్రాంతం నుంచి ఆమె పేరు ఉన్నది. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ అక్కడి నుంచే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గత ఎన్నికల్లో అక్కడి నుంచే ఓటు..
కాగా, జూన్ 10వ తేదీన విడుదలైన పంచాయతీ ఓటర్ల జాబితాలో మాత్రం స్మృతి ఇరానీ పేరు కనిపించలేదు. ఈ విషయం వెలుగులోకి రావడంతో విచారణకు ఆదేశించినట్లు జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ చౌహాన్ తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాతే ఓటు తొలగింపుపై స్పష్టత వస్తుందన్నారు. స్మృతి ఇరానీ పేరును పంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్చాలని దరఖాస్తు ఇచ్చామని అమేథీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుధాంశు శుక్లా చెప్పారు. అవసరమైన ధ్రువీకరణ అనంతరం ఆమె పేరును జాబితాలో చేరుస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు.
అమేథీ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా..
మేదాన్ మవాయి కంపోజిట్ స్కూల్ లీలా టిక్రా మవాయి పోలింగ్ స్టేషన్‌లో 514 సీరియల్ నబర్‌లో స్మృతి ఇరానీ పేరు ఉన్నది. ఆ పోలింగ్ స్టేషన్‌లో మొత్తం 666 రిజిస్టర్ ఓటర్లు ఉన్నారు. మేదాన్ మవాయి గ్రామంలో 2021 ఫిబ్రవరిలో ఆమె 1100 గజాల స్థలం కొన్నారు. అక్కడ ఇళ్లు నిర్మించి 2024లో గృహప్రవేశం చేశారు. 2014 నుంచి అమేథీ రాజకీయాల్లో స్మృతి ఇరాని యాక్టివ్‌గా ఉన్నారు. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతున్నారు. 2014లో రాహుల్ గాంధీపై ఓడిపోయిన ఆమె 2019లో ఆయనను ఓడించారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు.
సంబంధిత వార్తలు

Rahul Gandhi | నావికుల మృతిపై స్పందించని మోదీ.. మన కాంప్రమైజ్డ్ ప్రధానికి అంత ధైర్యం లేదంటూ రాహుల్ విమర్శలు
జూన్ 12, 2026

Congress Nationwide Protest | దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ సై! ‘నీట్’ వివాదం, రాజ్యసభ నామినేషన్ రద్దుపై మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా బిగ్ ప్లాన్
జూన్ 11, 2026

KTR | మొహబ్బత్ కీ దుకాన్.. హిట్లర్ కా మకాన్ అయిందా?.. రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న!
జూన్ 9, 2026
తాజావార్తలు
- ●RBI | ఆర్బీఐ కఠిన చర్యలు.. బ్యాంకుపై ఆంక్షలు, డిపాజిటర్లకు కీలక సూచనలు..
- ●Ramchandar Rao | ఇక తెలంగాణలో దొంగ ఓట్లుండవ్.. అసలైన లిస్టును తయారు చేద్దాం
- ●Bollywood | బాలీవుడ్లో విషాదం - ఛావా మూవీ నటి ఆత్మహత్య - సోషల్ మీడియాలో యాక్టివ్...అంతలోనే విషాదం!
- ●Noida Airport | నోయిడా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు మొదలు.. తొలి విమానంలో ప్రయాణించిన భూములిచ్చిన రైతులు
- ●Cucumber | చేదుగా ఉండే కీరదోసను తింటే ప్రమాదమా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
- ●PM Modi | అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ

RBI | ఆర్బీఐ కఠిన చర్యలు.. బ్యాంకుపై ఆంక్షలు, డిపాజిటర్లకు కీలక సూచనలు..

Ramchandar Rao | ఇక తెలంగాణలో దొంగ ఓట్లుండవ్.. అసలైన లిస్టును తయారు చేద్దాం

Bollywood | బాలీవుడ్లో విషాదం - ఛావా మూవీ నటి ఆత్మహత్య - సోషల్ మీడియాలో యాక్టివ్...అంతలోనే విషాదం!

Noida Airport | నోయిడా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు మొదలు.. తొలి విమానంలో ప్రయాణించిన భూములిచ్చిన రైతులు



