CP Ramesh | రోడ్లపై నీరు నిల్వకుండా ముందస్తు చర్యలు తీసుకోండి.. అధికారులకు సూచించిన సైబరాబాద్ సీపీ
CP Ramesh | వర్షాల నేపథ్యంలో రోడ్లపై వరద నీరు నిల్వ ఉండకుండా, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సైబరాబాద్ (Cyberabad) సీపీ డాక్టర్ ఎం. రమేశ్ (CP Ramesh), మున్సిపల్ కమిషనర్ సృజనతో కలిసి సైబరాబాద్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు.
CP Ramesh | త్రినేత్ర.న్యూస్: మరో వారం రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. వర్షాల నేపథ్యంలో రోడ్లపై వరద నీరు నిల్వ ఉండకుండా, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సైబరాబాద్ (Cyberabad) సీపీ డాక్టర్ ఎం. రమేశ్ (CP Ramesh), మున్సిపల్ కమిషనర్ సృజనతో కలిసి సైబరాబాద్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాకాలంలో నీటి నిల్వలు ఏర్పడే ప్రాంతాలను పరిశీలించి, సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు.
వర్షాల సమయంలో ఐటీ కారిడార్ పరిధిలోని మల్కం చెరువు, బయోడైవర్సిటీ జంక్షన్ సమీపంలోని కేర్ హాస్పిటల్ వద్ద రోడ్లపై భారీగా వరద నీరు చేరుతున్న ప్రాంతాలను పరిశీలించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రోడ్, కొండాపూర్‌లోని టయోటా షోరూం జంక్షన్ తదితర ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడుతున్న ప్రాంతాలను గుర్తించి, సమస్యల శాశ్వత పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వ ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు మునిసిపల్ అధికారులు, పోలీసులు, ఇంజినీరింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. త ద్వారా వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తగ్గడంతో పాటు ట్రాఫిక్ అంతరాయాలు నివారించబడతాయని తెలిపారు.
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..






