CMI Admissions | మ్యాథ్స్ కోర్సులకు నెలవు సీఎంఐ.. మరో రెండు రోజులే దరఖాస్తుకు గడువు
CMI Admissions | దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు ఒక్కో కోర్సుకు ఖ్యాతి చెందాయి. అలాంటివాటిలో చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్ (CMI) ఒకటి. ఈ సంస్థ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్‌ల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలతో పాటు ఎమ్మెస్సీ డేటాసైన్స్‌నూ అందిస్తున్నది. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు (CMI Admissions) సంబంధి మరో రెండు రోజుల్లో గడువు ముగియనుంది.
CMI Admissions | త్రినేత్ర.న్యూస్: దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు ఒక్కో కోర్సుకు ఖ్యాతి చెందాయి. అలాంటివాటిలో చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్ (CMI) ఒకటి. ఈ సంస్థ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్‌ల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలతో పాటు ఎమ్మెస్సీ డేటాసైన్స్‌నూ అందిస్తున్నది. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు (CMI Admissions) సంబంధి మరో రెండు రోజుల్లో గడువు ముగియనుంది. పరిశోధనపై ఆసక్తి కలిగినవారు ఈ కోర్సులను ఎంచుకోచ్చు. ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో మార్కుల ఆధారంగా ఇక్కడ సీట్లు దక్కుతాయి.
అన్ని కోర్సులను రెసిడెన్షియల్ విధానంలో అందిస్తున్నారు. విద్యార్థుల ఆర్థిక నేపథ్యం ప్రకారం పూర్తిగా లేదా పాక్షికంగా ఫీజు మినహాయింపు ఇస్తారు. అలాగే ప్రతిభావంతులకు యూజీ కోర్సులకు ప్రతి నెలా రూ.5 వేలు, ఎమ్మెస్సీ కోర్సులైతే రూ.6 వేలు అందిస్తారు. పీహెచ్‌డీలకు మొదటి రెండేండ్లూ నెలకు రూ.37 వేలు, తర్వాత మూడేండ్లు రూ.42 వేలు ఇస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత మల్టీనేషనల్ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా మంచి ప్యాకేజీలతో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి.
కోర్సులు
బీఎస్సీ ఆనర్స్
విభాగాలు: మ్యాథ్స్, మ్యాథ్స్-కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్-ఫిజిక్స్. వీటికి డేటా సైన్స్ మైనర్‌గా తీసుకోవచ్చు.
కోర్సు వ్యవధి: 4 ఏండ్లు. కావాలనుకుంటే మూడేండ్ల తర్వాత బీఎస్సీ డిగ్రీతో బయటకు రావొచ్చు.
అర్హత: ఇంటర్మీడియట్. ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎమ్మెస్సీ
విభాగాలు: మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్
కాలవ్యవధి: 2 ఏండ్లు
అర్హత: డిగ్రీలో మ్యాథ్స్ లేదా బీస్టాట్ లేదా బీటెక్ పూర్తిచేసుకున్నవారు ఎమ్మెస్సీ మ్యాథ్స్‌కు అర్హులు. కంప్యూటర్ సైన్స్ నేపథ్యంతో బీఎస్సీ, బీటెక్ కోర్సులు చదివినవారు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్‌కు అర్హులు. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్‌తో యూజీ కోర్సులు చదివినవారు ఎమ్మెస్సీ డేటా సైన్స్‌కు అర్హులు.
పీహెచ్‌డీ
విభాగాలు: మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్
అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ. చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశాలు..
కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా అన్ని కోర్సుల్లోనూ ప్రవేశం కల్పిస్తారు. నేషనల్ ఒలింపియాడుల్లో ప్రతిభావంతులకు నేరుగా యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు. పీజీ, పీహెచ్‌డీలకు పరీక్షలతో పాటు ఇంటర్వ్యూలూ ఉంటాయి.
ఫిజిక్స్‌లో పీహెచ్‌డీకి పరీక్ష ఉండదు. జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్టు (జెస్ట్) స్కోరుతో నేరుగా ఇంటర్వ్యూకు అవకాశం కల్పిస్తారు. అలాగే మ్యాథ్స్‌లో పీహెచ్‌డీ చేయాలనుకున్నవారు నేషనల్ బోర్డు ఫర్ హయ్యర్ మ్యాథమెటిక్స్ (ఎన్‌బీహెచ్‌ఎం) ఫెలోషిప్పునకు ఎంపికైతే పరీక్ష రాయకుండా నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. జెస్ట్‌తో కంప్యూటర్ సైన్స్‌లో రిసెర్చ్ అర్హత పొందినవారు కూడా ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం పొందవచ్చు. కోర్సుల వారీ సిలబస్, పాత ప్రశ్నాపత్రాలు, సొల్యూషన్లు సీఎంఐ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. బీఎస్సీ (ఆనర్స్) కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే పరీక్ష ఉంటుంది. అందువల్ల దరఖాస్తు సమయంలో అభ్యర్థులు కోర్సును ఎంపికచేసుకోవాల్సిన అవసరం లేదు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నంతోపాటు దేశంలో అన్ని ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 4
దరఖాస్తు ఫీజు: రూ.1100. రెండు కోర్సులకు రూ.1300.
అడ్మిట్ కార్డులు: ఏప్రిల్ 25
పరీక్ష: మే 2న
వెబ్‌సైట్: https://www.cmi.ac.in/admissions/
సంబంధిత వార్తలు

TG LAWCET | ఐసెట్‌ను మించి.. లాసెట్‌కు పెరుగుతున్న దరఖాస్తులు
ఏప్రిల్ 22, 2026

JEE Main 2026 Session 2 | దరఖాస్తు చేశారా?.. నేటితో ముగియనున్న జేఈఈ మెయిన్ సెషన్ 2 రిజిస్ట్రేషన్లు
ఫిబ్రవరి 25, 2026

Entrance Exams | ఫిబ్రవరి మొదటివారంలో ఈసెట్, లాసెట్ నోటిఫికేషన్లు.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?
జనవరి 28, 2026
తాజావార్తలు
- ●Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే - రజనీకాంత్‌కు పోటీగా!
- ●Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
- ●Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు
- ●TGPSC | టీజీపీఎస్సీ నిర్లక్ష్యం.. రోడ్లపై ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం
- ●Ramchander Rao | సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సిందే : రామచందర్ రావు
- ●Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం

Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే - రజనీకాంత్‌కు పోటీగా!

Talasani Srinivas Yadav | ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్

Rainfall | హైదరాబాద్‌లో లోటు వర్షపాతం.. దంచికొడుతున్న ఎండలు

TGPSC | టీజీపీఎస్సీ నిర్లక్ష్యం.. రోడ్లపై ఓఎంఆర్ షీట్లు ప్రత్యక్షం



