BHEL | బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు.. 415 ట్రైనీ పోస్టులతో నోటిఫికేషన్
BHEL | భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) వివిధ విభాగాల్లో ఇంజినీరింగ్/ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 415 ట్రైనీ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టింది.
BHEL | త్రినేత్ర న్యూస్: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) వివిధ విభాగాల్లో ఇంజినీరింగ్/ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 415 ట్రైనీ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ (Trainee Recruitment) చేపట్టింది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, హెచ్ఆర్, ఫైనాన్స్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్నవారు నవంబర్ 25 నుంచి డిసెంబరు 28 వరకు అధికారిక వెబ్‌సైట్ http://www.careers.bhel.in/లో చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 415
ఇంజినీరింగ్/ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ- 200
మెకానికల్- 80 (జనరల్ 32, ఈడబ్ల్యూఎస్ 8, ఓబీసీ 24, ఎస్సీ 12, ఎస్టీ 4)
ఎలక్ట్రికల్- 30 (జనరల్ 13, ఈడబ్ల్యూఎస్ 3, ఓబీసీ 8, ఎస్సీ 4, ఎస్టీ 2)
ఎలక్ట్రానిక్స్- 25 (జనరల్ 11, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 6, ఎస్సీ 4, ఎస్టీ 2)
సివిల్- 15 (జనరల్ 6, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 4, ఎస్సీ 2, ఎస్టీ 1)
హెచ్‌ఆర్- 20 (జనరల్ 8, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 5, ఎస్సీ 3, ఎస్టీ 2)
ఫైనాన్స్- 20 (జనరల్ 8, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 5, ఎస్సీ 3, ఎస్టీ 2)
ఐటీ/సీఎస్- 10 (జనరల్ 4, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 3, ఎస్సీ 1, ఎస్టీ 1)
సూపర్వైజర్ ట్రెయినీ: 215
మెకానికల్- 103 (జనరల్ 43, ఈడబ్ల్యూఎస్ 11, ఓబీసీ 28, ఎస్సీ 16, ఎస్టీ 5)
ఎలక్ట్రికల్- 30 (జనరల్ 16, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 5, ఎస్సీ 5, ఎస్టీ 2)
ఎలక్ట్రానిక్స్- 11 (జనరల్ 5, ఓబీసీ 4, ఎస్సీ 2)
సివిల్- 26 (జనరల్ 12, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 7, ఎస్సీ 3, ఎస్టీ 2)
హెచ్‌ఆర్- 20 (జనరల్ 13, ఓబీసీ 3, ఎస్సీ 3, ఎస్టీ 1)
ఫైనాన్స్- 25 (జనరల్ 13, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 7, ఎస్సీ 4)
అర్హత
ఇంజినీరింగ్/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా ఇంజినీరింగ్ /టెక్నాలజీలో ఫుల్-టైమ్ బ్యాచిలర్ డిగ్రీ లేదా ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ కలిగి ఉండాలి.
ఇంజినీరింగ్ విభాగాలలో/ ఫైనాన్స్‌లో అర్హత కలిగిన చార్టర్డ్ అకౌంటెంట్ (CA) లేదా కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (CMA), బ్యాచిలర్ డిగ్రీతో పాటు హెచ్ఆర్ లేదా పర్సనల్ మేనేజ్‌మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా సోషల్ వర్క్‌లో రెండేండ్ల ఫుల్-టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా లేదా హెచ్‌ఆర్ పోస్టుల కోసం చివరి సంవత్సరంలో పర్సనల్ మేనేజ్‌మెంట్, లేబర్ వెల్ఫేర్, హెచ్‌ఆర్‌ఎమ్‌లో స్పెషలైజేషన్, ఎలెక్టివ్‌తో కూడిన ఎంబీఏ చేసి ఉండాలి.
సూపర్వైజర్ పోస్టులకు ఇంజినీరింగ్‌లో డిప్లొమా/హెచ్‌ఆర్ కోసం బీబీఏ లేదా సోషల్ వర్క్ లేదా బిజినెస్ మేనేజ్‌మెంట్ లేదా బీబీఎస్ లేదా బీఎంఎస్‌లో బ్యాచిలర్ డిగ్రీ/ఫైనాన్స్ కోసం కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా. అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఇతర దశలు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.1072 (పరీక్ష ఫీజు రూ.600, ప్రాసెసింగ్ ఫీజు రూ.400+జీఎస్టీ), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.472 (ప్రాసెసింగ్ ఫీజు+జీఎస్టీ మాత్రమే)
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 25
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 28
వెబ్‌సైట్: www.careers.bhel.in
తాజావార్తలు
- ●Deeksha Divas | తెలంగాణ ఏర్పాటుకు నాంది పలికిన పదకొండు రోజులు
- ●Remedies | కార్తీక పౌర్ణమి వేళ ఈ 5 పరిహారాలు పాటించండి.. లక్ష్మీ కటాక్షంతో సిరిసంపదలు మీ సొంతం!
- ●Horoscope | నవంబర్ 24 మంగళవారం.. ఈ రాశివారికి పని ఒత్తిడి పెరిగే అవకాశం!
- ●Karthika Pournami | నేడే కార్తీక పౌర్ణమి.. ఏ సమయంలో దీపారాధన చేయాలి? జ్వాలాతోరణం వెనుక ఆసక్తికర విషయాలు తెలుసా..?
- ●Sky Road Pingtian Lake China | నీటిపై తేలుతున్న రహదారి.. మేఘాల్లో ప్రయాణిస్తున్న అనుభూతి! చైనా 'స్కై రోడ్' అద్భుత దృశ్యాలివే..!
- ●Singareni Naini Coal Mine | సింగరేణి చరిత్రలో మరో మైలురాయి: నైనీ బొగ్గు గని నుంచి 10 లక్షల టన్నుల బొగ్గు రవాణా పూర్తి

Deeksha Divas | తెలంగాణ ఏర్పాటుకు నాంది పలికిన పదకొండు రోజులు

Remedies | కార్తీక పౌర్ణమి వేళ ఈ 5 పరిహారాలు పాటించండి.. లక్ష్మీ కటాక్షంతో సిరిసంపదలు మీ సొంతం!

Horoscope | నవంబర్ 24 మంగళవారం.. ఈ రాశివారికి పని ఒత్తిడి పెరిగే అవకాశం!

Karthika Pournami | నేడే కార్తీక పౌర్ణమి.. ఏ సమయంలో దీపారాధన చేయాలి? జ్వాలాతోరణం వెనుక ఆసక్తికర విషయాలు తెలుసా..?






