త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Venkatesh | ఖాజీపేట ప్రేమోన్మాది వెంకటేశ్‌పై పోలీసుల కాల్పులు..

Venkatesh | త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌డ‌ప జిల్లా ఖాజీపేటలో (kazipet) బాలిక‌ను గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది వెంక‌టేశ్‌పై (Venkatesh) పోలీసులు కాల్పులు జ‌రిపారు. త‌న ప్రేమను నిరాక‌రించింద‌ని రామ‌కీర్త‌న అనే బాలిక‌ను శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం వెంక‌టేశ్ దారుణంగా హ‌త్య చేశాడు.

G

National | Published On Apr 11, 2026, 8.14 am IST

Venkatesh | ఖాజీపేట ప్రేమోన్మాది వెంకటేశ్‌పై పోలీసుల కాల్పులు..
Advertisement

Venkatesh | త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌డ‌ప జిల్లా ఖాజీపేటలో (kazipet) బాలిక‌ను గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది వెంక‌టేశ్‌పై (Venkatesh) పోలీసులు కాల్పులు జ‌రిపారు. త‌న ప్రేమను నిరాక‌రించింద‌ని రామ‌కీర్త‌న అనే బాలిక‌ను శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం వెంక‌టేశ్ దారుణంగా హ‌త్య చేశాడు. దీంతో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని.. శనివారం తెల్ల‌వారుజామున‌ మైదుకూరు నుంచి మ‌రో ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్తున్నారు. ఈ స‌మ‌యంలో బాసాపురం చెక్‌పోస్ట్ దగ్గర పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అడ్డుకోవడంతో వారిపై దాడి చేశాడు. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. పారిపోతున్న నిందితుడిని అడ్డుకునేందుకు పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జ‌రిపారు. అయితే వెంక‌టేశ్ ఎదురు తిర‌గ‌డంతో.. సీఐ వంశీధర్ అత‌ని కాళ్ల‌పైకి కాల్పులు జరిపారు. గాయప‌డిన నిందితుడిని కడప రిమ్స్‌కు తరలించారు.

అస‌లేం జ‌రిగిందంటే..

ఖాజీపేట అగ్ర‌హారానికి చెందిన శ్రీనివాసులు, నాగ మునెమ్మ దంప‌తుల కుమార్తె రామ‌కీర్త‌న (17) ఇంట‌ర్ పూర్తి చేసింది. అదే మ‌డలం ప‌రిధిలోని ఆంజనేయకొట్టాల గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశ్ కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండ‌టంతో ఆమె నిరాక‌రిస్తూ వ‌స్తున్న‌ది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న వెంక‌టేశ్‌.. శుక్రవారం మధ్యాహ్నం ఎవ‌రూ లేని స‌మ‌యంలో బాలిక ఇంటికి వెళ్లాడు. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని అడ‌గ‌డంతో.. ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకున్న‌ది. దీంతో త‌న వెంటతెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు.

Advertisement
Advertisement