త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం.. కూక‌ట్‌ప‌ల్లిలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో గ‌ణ‌నాథుల నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఐడీఎల్ లేక్, ప్ర‌గ‌తి న‌గ‌ర్ చెరువు, గంగారం చెరువు, క‌ట్ట‌మైస‌మ్మ చెరువు, మ‌ల్కం చెరువులో గ‌ణేశ్ విగ్ర‌హాల‌ను భ‌క్తులు నిమ‌జ్జ‌నం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్త‌కుండా ట్రాఫిక్ పోలీసులు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

S

Hyderabad | Published On Sep 22, 2026, 3.03 pm IST

Traffic Restrictions | గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం.. కూక‌ట్‌ప‌ల్లిలో ట్రాఫిక్ ఆంక్ష‌లు
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో గ‌ణ‌నాథుల నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఐడీఎల్ లేక్, ప్ర‌గ‌తి న‌గ‌ర్ చెరువు, గంగారం చెరువు, క‌ట్ట‌మైస‌మ్మ చెరువు, మ‌ల్కం చెరువులో గ‌ణేశ్ విగ్ర‌హాల‌ను భ‌క్తులు నిమ‌జ్జ‌నం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్త‌కుండా ట్రాఫిక్ పోలీసులు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ట్రాఫిక్ ఆంక్ష‌లు ఇలా..

  • కూక‌ట్‌ప‌ల్లి వై జంక్ష‌న్ నుంచి ఐడీఎల్ చెరువు మీదుగా మాదాపూర్ వైపు వెళ్లే వాహ‌నాల‌ను జేఎన్టీయూ వైపు మ‌ళ్లిస్తున్నారు. జేఎన్టీయూ నుంచి ఫోరం మాట్, హైటెక్ సిటీ మీదుగా మాదాపూర్ చేరుకోవాల్సి ఉంటుంది.
  • హైటెక్ సిటీ నుంచి కూక‌ట్‌ప‌ల్లి వై జంక్ష‌న్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను ల‌క్కీ రెస్టారెంట్ సిగ్న‌ల్, ఫోర్త్ ఫేజ్ కేపీహెచ్‌బీ, రోడ్ నంబ‌ర్ 1, రెమిడీ హాస్పిట‌ల్ యూ ట‌ర్న్ మీదుగా కూక‌ట్‌ప‌ల్లి వై జంక్ష‌న్‌కు చేరుకోవాలి.
  • గండి మైస‌మ్మ, ప్ర‌గ‌తి న‌గ‌ర్ నుంచి జేఎన్టీయూ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను ప్ర‌గ‌తి న‌గ‌ర్ మీదుగా నిజాంపేట్ విలేజ్, 191 స‌ర్వే నంబ‌ర్ కాల‌నీ రోడ్, నిజాంపేట్ రోడ్ మీదుగా జేఎన్టీయూకు మ‌ళ్లించ‌నున్నారు.
  • జేఎన్టీయూ నుంచి ప్ర‌గ‌తి న‌గ‌ర్ కాల‌నీ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను శ్రీనివాస స్టీల్(తుల‌సీ న‌గ‌ర్‌) మీదుగా కొన‌సీమ హోట‌ల్ రోడ్, కొల‌న్ రాఘ‌వ‌రెడ్డి గార్డెన్స్, నిజాంపేట్ విలేజ్ నుంచి ప్ర‌గ‌తి న‌గ‌ర్‌కు మ‌ళ్లించ‌నున్నారు.
  • ప‌టాన్‌చెరు నుంచి సిటీలోకి వ‌చ్చే భారీ వాహ‌నాల‌ను బీహెచ్ఈఎల్ జంక్ష‌న్ వ‌ద్ద తారా న‌గ‌ర్ మార్కెట్, తెల్లాపూర్, గోప‌న్‌ప‌ల్లి మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.
  • గండిమైస‌మ్మ ఎక్స్ రోడ్ నుంచి బాలాన‌గ‌ర్ వైపు వెళ్లే వాహ‌నాల‌ను బ‌హ‌దూర్‌ప‌ల్లి జంక్ష‌న్ వ‌ద్ద మ‌ళ్లించ‌నున్నారు. బాలాన‌గ‌ర్ నుంచి గండిమైస‌మ్మ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను సూరారం జంక్ష‌న్ వ‌ద్ద మ‌ళ్లించ‌నున్నారు.
  • ద‌ర్గా నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను రోడ్ నంబ‌ర్ 32 వ‌ద్ద మ‌ళ్లించి మ‌ల్కం చెరువు రోడ్, కిమ్స్ హాస్పిట‌ల్ లేన్, ఓల్డ్ ముంబై హైవే మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.
Advertisement

తాజావార్తలు

Advertisement