త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Police Recruitment | పోలీసు శాఖ‌లో 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు

Police Recruitment | నిరుద్యోగుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh Police) ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు రోజుల క్రిత‌మే 892 ఉద్యోగాల భ‌ర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) నియామ‌క ప్రక్రియ ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

G

National | Published On Sep 16, 2026, 11.41 am IST

Police Recruitment | పోలీసు శాఖ‌లో 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు
Advertisement

Police Recruitment | త్రినేత్ర‌.న్యూస్‌: నిరుద్యోగుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh Police) ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు రోజుల క్రిత‌మే 892 ఉద్యోగాల భ‌ర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) నియామ‌క ప్రక్రియ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. తాజాగా పోలీస్ శాఖ‌లో ఖాళీగా ఉన్న 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భ‌క్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు APSLPRB నోటిఫికేష‌న్ (Police Recruitment) విడుద‌ల చేసింది. ఇందులో 378 ఎస్ఐ పోస్టులు, 1,156 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన‌వారు అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది.

అత్య‌ధికంగా కానిస్టేబుల్ విభాగంగ‌లో సివిల్ (542), ఏఆర్ (285) పోస్టులు, ఎస్ఐ పోస్టుల్లో 253 సివిల్‌, ఏఆర్ విభాగంలో 116 ఖాళీలు ఉన్నాయి. వీటితోపాటు జైల్ వార్డ‌ర్‌, క‌మ్యూనికేష‌న్‌, పీటీవో, మెకానిక్‌లు, డ్రైవ‌ర్‌, సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలు కూడా ఉన్నాయి. త్వరలో రాత పరీక్ష తేదీల వివరాలను వెల్లడించనుంది.

విభాగాల వారీగా పోస్టులు..
SI సివిల్- 253
SI ఏఆర్‌- 116
SI SPF (పురుషులు)- 9
SCT SI (కమ్యూనికేషన్)- 50
SI (PTO)- 10
సైంటిఫిక్ అసిస్టెంట్ (FSL)- 43
PC (సివిల్/AR) పోస్టులు- 827
ఫైర్‌మెన్‌- 158
జైలు వార్డ‌ర్ - 171
PC కమ్యూనికేషన్- 200
PC మెకానిక్స్, డ్రైవర్లు (పురుషులు)- 213
వెబ్‌సైట్: https://slprb.ap.gov.in

Advertisement
Advertisement