Guru Purnima | షిర్డీలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు.. రూ.1.03కోట్ల బంగారు కిరీటాన్ని బహూకరించిన ఏపీ భక్తుడు
Guru Purnima | మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా వేకువ జాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు బాబా ఆలయానికి తరలివచ్చి దర్శించుకున్నారు. ఈ వేడుకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన భక్తుడు మల్లాడి శ్రీనివాసరావు రూ.1.03 కోట్ల విలువైన బంగారు కిరీటాన్ని సాయిబాబాకు సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు.
Guru Purnima | మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా వేకువ జాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు బాబా ఆలయానికి తరలివచ్చి దర్శించుకున్నారు. ఈ వేడుకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన భక్తుడు మల్లాడి శ్రీనివాసరావు రూ.1.03 కోట్ల విలువైన బంగారు కిరీటాన్ని సాయిబాబాకు సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు. 642 గ్రాముల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ కిరీటాన్ని గురుపౌర్ణమి ఉత్సవాల ప్రారంభ రోజున ఆలయ ట్రస్ట్‌కు గురుదక్షిణగా అందజేశారు. ఈ కిరీటంపై శ్రీమహావిష్ణువు దశావతారాల ప్రతిరూపాలను తీర్చిదిద్దడం విశేషం. సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ కిరీటాన్ని బాబాకు అలంకరించగా.. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Sai Baba
ఈ సందర్భంగా మల్లాడి శ్రీనివాసరావు మాట్లాడుతూ సాయిబాబా నవగ్రహ స్వరూపుడనే తన విశ్వాసంతో ఈ బంగారు కిరీటాన్ని సమర్పించినట్లు తెలిపారు. తన జీవితంలో లభించిన అనుగ్రహానికి కృతజ్ఞతగా ఈ గురుదక్షిణ అర్పించినట్లు పేర్కొన్నారు. శ్రీనివాసరావు తరచూ షిర్డీ ఆలయాన్ని సందర్శిస్తుంటారని, ఆలయ ట్రస్ట్ చేపట్టే సేవా కార్యక్రమాలకు సైతం విరాళాలు అందిస్తుంటారని ఆలయ అధికార వర్గాలు తెలిపాయి. సాయిబాబా ఆస్పత్రితో పాటు భక్తులకు సంబంధించిన ఇతర సౌకర్యాల అభివృద్ధికీ ఆయన సహకారం అందిస్తున్నారు. ఆలయ ట్రస్ట్ సీఈవో గోరక్ష గడిల్కర్ కృతజ్ఞతలు తెలిపారు. గురుపౌర్ణమి సాయిబాబా భక్తులకు అత్యంత పవిత్రమైన పర్వదినమని తెలిపారు. గురుపౌర్ణమి వేడుకల సందర్భంగా షిర్డీ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సాయినామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Guru Ravidas 650th Birth Anniversary | గురు పూర్ణిమ రోజున 21 వేల ప్రాంతాల్లో కలశ వందన.. 51 వేల గుళ్లలో దీపోత్సవం
జులై 27, 2026

Union Cabinet | ఏపీ–కర్ణాటక ఆర్థిక కారిడార్‌కు కేంద్రం ఆమోదం.. రూ.4,294 కోట్లతో మౌలిక వసతుల విస్తరణ
జులై 24, 2026

Driving Test | బ్రేక్ బదులు యాక్సిలరేటర్ తొక్కింది.. కారు జనంపైకి దూసుకెళ్లింది..
జులై 23, 2026
తాజావార్తలు
- ●Harish Rao | క్యాన్సర్‌కు భయపడాల్సిన అవసరం లేదు.. ఆలస్యం చేస్తేనే ప్రమాదం
- ●Minister Vivek | పరిశ్రమల్లో భద్రతే తొలి ప్రాధాన్యం..
- ●Rahul Gandhi | లోక్‌సభలో రాహుల్ Vs కేంద్రం.. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై సభలో రగడ
- ●Manushi Chhillar | కామన్వెల్త్ గేమ్స్ వేదికపై మానుషి సందడి.. స్పెషల్ ప్రదర్శన ఇవ్వనున్న మాజీ మిస్‌వరల్డ్..!
- ●Dell XPS 13 | ఏఐ ఫీచర్లతో వచ్చిన డెల్ కొత్త ఎక్స్పీఎస్ ల్యాప్‌టాప్‌లు.. బడ్జెట్ ధరలకే లాంచ్..
- ●RS Praveen Kumar | రూ. 1100 కోట్ల స్కాం బయటపెట్టినందుకే 'పెద్ది'కి వేధింపులు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Harish Rao | క్యాన్సర్‌కు భయపడాల్సిన అవసరం లేదు.. ఆలస్యం చేస్తేనే ప్రమాదం

Minister Vivek | పరిశ్రమల్లో భద్రతే తొలి ప్రాధాన్యం..

Rahul Gandhi | లోక్‌సభలో రాహుల్ Vs కేంద్రం.. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై సభలో రగడ

Manushi Chhillar | కామన్వెల్త్ గేమ్స్ వేదికపై మానుషి సందడి.. స్పెషల్ ప్రదర్శన ఇవ్వనున్న మాజీ మిస్‌వరల్డ్..!



