Driving Test | బ్రేక్ బదులు యాక్సిలరేటర్ తొక్కింది.. కారు జనంపైకి దూసుకెళ్లింది..
Driving Test | డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) కోసం ఓ యువతి ఆర్టీఏ (RTO) కార్యాలయంలో డ్రైవింగ్ టెస్టుకు (Driving Test) హాజరైంది. ట్రాక్‌పై కారు నడుపుతున్నది. కొంత ముందుకు వెళ్లిన తర్వాత బ్రేక్ (Brake) తొక్కడానికి బదులు యాక్సిలరేటర్‌ను (Accelerator) తొక్కింది.
Andhra pradesh | Published On Jul 23, 2026, 7.02 am IST
Driving Test | త్రినేత్ర.న్యూస్: డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) కోసం ఓ యువతి ఆర్టీఏ (RTO) కార్యాలయంలో డ్రైవింగ్ టెస్టుకు (Driving Test) హాజరైంది. ట్రాక్‌పై కారు నడుపుతున్నది. కొంత ముందుకు వెళ్లిన తర్వాత బ్రేక్ (Brake) తొక్కడానికి బదులు యాక్సిలరేటర్‌ను (Accelerator) తొక్కింది. దీంతో అదుపుతప్పిన కారు అక్కడున్న జనంపైకి దూసుకెళ్లింది. దీంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో (Tenali) జరిగింది.
డ్రైవింగ్ లైసెన్సులు, రెన్యువల్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తెనాలి మార్కెట్ యార్డు ప్రాంగణంలో టెస్ట్ డ్రైవ్‌లు నిర్వహించారు. ఇందులో పాల్గొనడానికి పట్టణానికి చెందిన ఇద్దరు యువతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి కారులో వచ్చారు. ఒక యువతి కారును మంచిగానే నడిపింది. ఆ తర్వాత ఆమె అందులోనే కూర్చుంది. రెండో యువతి కారును స్టార్ట్ చేసి కొంత దూరం బానే తీసుకెళ్లింది. ఈ క్రమంలో బ్రేక్‌కు బదులు ఎక్సలేటర్ తొక్కింది. దీంతో అదుపుతప్పిన కారు పక్కనే ఉన్న ప్రజలు, వాహనాల మీదికి దూసుకెళ్లింది. అప్రమత్తమైన కారులోని మరో యువతి హ్యాండ్ బ్రేక్ వేయడంతో బైకులను ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వృద్ధులు, ఒక మహిళ గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించారు.
సంబంధిత వార్తలు

Guru Purnima | షిర్డీలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు.. రూ.1.03కోట్ల బంగారు కిరీటాన్ని బహూకరించిన ఏపీ భక్తుడు
జులై 29, 2026

Union Cabinet | ఏపీ–కర్ణాటక ఆర్థిక కారిడార్‌కు కేంద్రం ఆమోదం.. రూ.4,294 కోట్లతో మౌలిక వసతుల విస్తరణ
జులై 24, 2026

Coronavirus | హైదరాబాద్‌లో కరోనా కలకలం.. తార్నాకలో మహిళ మృతి
జులై 22, 2026
తాజావార్తలు
- ●Heavy Rains | 13 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ఉత్తర తెలంగాణకు అతి భారీ వర్ష సూచన
- ●Malavika Mohanan | యాక్షన్ పాత్రలపై మాళవిక మోహనన్ ఆసక్తి.. మహిళా దర్శకులపై కీలక వ్యాఖ్యలు..!
- ●IPL-RCB | రూ.2లక్షల కోట్ల దిశగా ఐపీఎల్ విలువ.. ఆర్సీబీకి అరుదైన ఘనత
- ●Konda Surekha | పులుల సంరక్షణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి : మంత్రి కొండా సురేఖ
- ●TRAI | దూసుకెళ్తున్న టెలికాం రంగం.. దేశంలో 130 కోట్లకు పైగా వైర్లెస్ కనెక్షన్లు..
- ●National Honour (Amendment) Bill | వందేమాతరం బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు

Heavy Rains | 13 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ఉత్తర తెలంగాణకు అతి భారీ వర్ష సూచన

Malavika Mohanan | యాక్షన్ పాత్రలపై మాళవిక మోహనన్ ఆసక్తి.. మహిళా దర్శకులపై కీలక వ్యాఖ్యలు..!

IPL-RCB | రూ.2లక్షల కోట్ల దిశగా ఐపీఎల్ విలువ.. ఆర్సీబీకి అరుదైన ఘనత

Konda Surekha | పులుల సంరక్షణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి : మంత్రి కొండా సురేఖ



